టాలీవుడ్ హీరో నిఖిల్ తాజాగా ఓ వీడియోను విడుదల చేసాడు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దాటికి అతలాకుతలం అయిపోతున్న తెలుగు రాష్ట్రాల పరిస్థితిని ఇందులో వివరిస్తూ వచ్చాడు. ఈ వీడియో ద్వారా నిఖిల్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దాటికి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.ఇవి చూసి నేను ఆవేశం, బాధ, అసహాయతకి లోనయ్యాను. లాస్ట్ 3 వీక్స్ నుండీ నేను షూటింగ్‌లు లేక ఇంట్లో ఉన్నాను. నాతో పాటు నా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా కరోనా నుండీ ఎస్కేప్ అవ్వడం కోసం ఇంట్లోనే ఉంటున్నాము.
కానీ ఖాళీగా ఉండడం ఎందుకులే అని నేను నా స్నేహితులు ఎన్జీవోల ద్వారా మాకు తోచిన సహాయం చేస్తున్నాము.ఇది కూడా ఏ మాత్రం సరిపోవడం లేదు. ‘కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నాయి.ఓ వ్యక్తికి సాయం అందించడానికి అతనికి ఫోన్ చేసి మాట్లాడాము.కానీ తరువాత 30 నిమిషాల్లోనే అతను చనిపోయాడు. బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారు అనుకోవద్దు. అది ఇంపాజిబుల్..! అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్లు వాడాలి.
పొలిటీషియన్స్ అయితే ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడానికే అన్నట్టు ఉన్నారు.అయితే ఇలాంటి సిట్యుయేషన్లో కూడా హ్యుమానిటీ అనేది కనిపిస్తుంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం మనం చూస్తున్నాం. నిజంగా ఇది ఆనందం కలిగించే విషయం. ఇలాగే అందరూ పక్కవాళ్లకు సాయపడాలని కోరుకుంటున్నాను’ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!