ఒకప్పుడు టాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా హవా కొనసాగించిన రాజశేఖర్ (Rajasekhar) , ప్రస్తుతం లైమ్‌లైట్ లోకి రావడానికి చాలానే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు హీరోగా చేసిన పోలీస్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి. అప్పట్లో మాస్ ఆడియన్స్‌కు రాజశేఖర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. కానీ, కాలం మారింది. ఇప్పుడీ తరహా చిత్రాలకు ఆడియన్స్ రెస్పాన్స్ తగ్గింది. మరోవైపు, రాజశేఖర్ కూడా వరుస ఫ్లాపులతో తన మార్కెట్‌ను కోల్పోయారు. అయితే, తనతో సమానంగా కొనసాగిన ఒకప్పటి సీనియర్ జగపతి బాబు (Jagapathi Babu), శ్రీకాంత్ (Srikanth) లాంటి వారు నెగటివ్ రోల్స్‌లోకి మారి సక్సెస్ సాధించగా, రాజశేఖర్ మాత్రం ఆ మార్గంలో వెళ్లేందుకు చాలా ఆలస్యం చేశారు.
ఇప్పటికీ తనకు విలన్ రోల్స్ వచ్చేలా ప్రయత్నిస్తున్నా, ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. సోలో హీరోగా నిలదొక్కుకునేందుకు చేసిన కల్కి (2019) కొంతమేరకు ఆకట్టుకున్నా, ఆ తర్వాతి ప్రాజెక్ట్స్ విఫలమయ్యాయి. దెయ్యం, శేఖర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేదు. సినిమాల పరంగా వెనుకబడిన రాజశేఖర్, టాలీవుడ్‌లో విలన్ రోల్స్‌కి రెడీ అని చెప్పినప్పటికీ, మరీ పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. జగపతి బాబు, శ్రీకాంత్, అరవింద్ స్వామి (Arvind Swamy) లాంటి స్టార్లు ఇప్పటికే విలన్ రోల్స్‌ను డామినేట్ చేస్తుండటంతో, మేకర్స్ రాజశేఖర్ వైపు పెద్దగా చూడటం లేదన్నది నిజం.
దీంతో తన కెరీర్ మళ్లీ మలుపు తిరుగుతుందా? లేక ఇక్కడితో ముగుస్తుందా? అన్నదానిపై సందేహం నెలకొంది. ఇక ఆయన కుమార్తెలు శివాని (Shivani Rajashekar), శివాత్మికలు (Shivathmika Rajashekar) హీరోయిన్స్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చినా, ఇప్పటి వరకు కమర్షియల్‌గా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. శివాని సినిమాల జోరు మొదట్లో బాగానే ఉన్నా, సక్సెస్ లేకపోవడంతో ఆమె బ్యాక్‌సీట్లోకి వెళ్లిపోయింది. శివాత్మిక కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో చేసినా, ఇప్పటి వరకు బ్రేక్ రాలేదు.
దీంతో రాజశేఖర్ ఫ్యామిలీ నుంచి ఇప్పట్లో ఎవరైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారా? అన్నదానిపై కూడా అనుమానాలే ఉన్నాయి. ఇంతకీ, రాజశేఖర్ మళ్లీ తెరపై రీఎంట్రీ ఇవ్వాలంటే, ముందు మంచి విలన్ రోల్‌తో స్ట్రాంగ్‌గా రీబూట్ కావాలి. ఒక సరైన డైరెక్టర్, రైట్ సబ్జెక్ట్ ఉంటే, ఆయన విలన్‌గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి, టాలీవుడ్ మేకర్స్ రాజశేఖర్‌ను సీరియస్‌గా తీసుకుని విలన్‌గా ఓ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.