2023 చివర్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘మ్యాడ్’ (MAD) సినిమా మంచి విజయాన్నే అందుకుంది. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాగే నాగ వంశీ చెల్లెలు, ఎస్.చినబాబు కూతురు అయినటువంటి హారిక ఈ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘మ్యాడ్’ సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) కూడా రాబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. వాస్తవానికి ఫిబ్రవరిలోనే రావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. మొత్తానికి మార్చి 29న రిలీజ్ కాబోతోంది.
ఇక రిలీజ్ కి నెల రోజులు మాత్రమే టైం ఉండటంతో ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం టీజర్ ను కూడా వదిలారు. ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:53 సెకన్ల నిడివి కలిగి ఉంది. లడ్డుకి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం. 3 రోజుల్లో అతనికి పెళ్లి జరిగే టైంలో.. అతని ఫ్రెండ్స్ అయినటువంటి అశోక్, డిడి అలియాస్ దామోదర్, మనోజ్..లు వస్తారు. వాళ్ళు చేసే అల్లరి వల్ల… లడ్డు పెళ్ళికి చాలా సమస్యలు వచ్చి పడతాయి.
అవేంటి.. అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కామెడీతో కూడిన పంచ్ లు చాలానే ఉన్నాయి. ‘పెళ్లి కూతురు నోట్లో స్వీట్ పెట్టి పేరు చెప్పమంటే.. సోమ్ పాపిడి అనడం’.. చివర్లో హీరో గ్యాంగ్ కి ఎవరో ఫోన్ చేసి ‘బాయ్ అంటే సరే బాయ్’ అని ఫోన్ పెట్టేయడం హిలేరియస్ గా అనిపిస్తాయి. ఈ సినిమాలో ‘మ్యాడ్’ ని మించి ఫన్ ఉండబోతుంది అని టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. మీరు కూడా ఓ లుక్కేయండి :