బాలయ్య- అనిల్ మూవీలో రాజశేఖర్?

నందమూరి బాలకృష్ణ గతేడాది చివర్లో వచ్చిన ‘అఖండ’ తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రంతో బాలయ్య- బోయపాటి కాంబో హ్యాట్రిక్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ … గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్. అయితే బాలయ్యని మాస్ యాంగిల్ లో చూస్తూనే ఉన్నాం. కానీ.. బాలయ్య ఓ మల్టీస్టారర్ చేస్తే చూడాలని,అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్రెడీ బాలయ్యకి సరిపడే మల్టీస్టారర్ కథ బోయపాటి వద్ద ఉంది.

కానీ సెకండ్ హీరో సెట్ అవ్వడం లేదు. అలాగే బాలయ్యతో మల్టీస్టారర్ చేయాలని కొరటాల కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు సాయి ధరమ్ తేజ్ రెడీగానే ఉన్నాడు. అయినా ఈ ప్రాజెక్టు ఇంకా సెట్ అవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న చిత్రంలో మరో హీరోకి కూడా అవకాశం ఉందట. ఆ హీరో మన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ అని తెలుస్తుంది. కొద్దిరోజులుగా ఈ ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రంలో రాజశేఖర్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ బాలయ్యకి ఎదురు తిరుగుతూనే కామెడీ చేసే క్యారెక్టర్ రాజశేఖర్ ది అని తెలుస్తుంది. రాజశేఖర్ కూడా చాలా రోజులుగా మల్టీస్టారర్ లేదా ఓ పెద్ద సినిమాలో విలన్ కాకుండా పాముఖ్యమైన పాత్రలో నటించాలి అనుకుంటున్నారు. కానీ అందుకు తగ్గ కథ సెట్ అవ్వడం లేదు.

అయితే ఎట్టకేలకు అనిల్ రావిపూడి వినిపించిన స్క్రిప్ట్ రాజశేఖర్ కు నచ్చిందట. ఈ పాత్ర చేయడానికి అతను రెడీగానే ఉన్నట్లు తెలుస్తుంది. బాలయ్య కెరీర్లో 108 వ చిత్రంగా తెరకెక్కనుంది ఈ చిత్రం. ఇంకో విశేషం ఏంటి అంటే ఈ చిత్రంలో రాజశేఖర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోబోతున్నారట.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus