సాధారణంగా సినిమాల మధ్య పోటీ అనగానే అందరికీ సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది. ఆ టైంలో పెద్ద సినిమాలు ఒకదాని వెనుక ఒకటి రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే కోవిడ్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రతి శుక్రవారం ఎలా కాదనుకున్నా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పండుగ రోజుల్లో అయితే మంచి క్రేజ్ ఉన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అవి ఎంత వరకు సక్సెస్ అవుతున్నాయి అన్నది తర్వాత.
ఈ ఏడాది దసరా కానుకగా అంటే అక్టోబర్ 20 న బాలకృష్ణ – అనిల్ రావిపూడి ల ‘భగవంత్ కేసరి’ , రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ , రామ్ – బోయపాటి ల ‘స్కంద'(వర్కింగ్ టైటిల్) కూడా అదే డేట్ కి రాబోతుందని.. అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చాయి. కానీ బాలయ్య కోసం బోయపాటి కాంప్రమైజ్ అయ్యి తన సినిమాని ముందుగా రిలీజ్ చేసేస్తున్నాడు.
సెప్టెంబర్ 15 న (Ram) రామ్ – బోయపాటి ల సినిమా విడుదల కాబోతుంది. అయితే ఆ టైంలో కూడా ఈ సినిమాకి గట్టి పోటీనే ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ‘డిజె టిల్లు’ సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’ అదే డేట్ కి రాబోతోంది. తాజాగా ‘చంద్రముఖి 2 ‘ కూడా అదే డేట్ కి రాబోతున్నట్టు ప్రకటించారు. సో వినాయక చవితి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సందడి నెలకొందని తెలుస్తుంది.
అయితే ఈ మూడు సినిమా జోనర్లు వేటికవే ప్రత్యేకమైనవి కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. రామ్ – బోయపాటి ల సినిమా పక్కాగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా కాగా ‘టిల్లు స్క్వేర్’ పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి తీస్తున్న సినిమా. ఇక ‘చంద్రముఖి 2 ‘ అనేది హారర్ జోనర్ ను ఇష్టపడే ప్రియుల కోసం. సో మూడు సినిమాలకు హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద బాగానే గట్టెక్కేసే అవకాశాలు ఉన్నాయి.