Hero Ram: ప్లాప్ వచ్చినా తగ్గనంటున్న యంగ్ హీరో!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ ఆడియన్స్ కు దగ్గరైన హీరో రామ్.. ఇప్పుడు మాస్ కథల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటించిన ‘రెడ్’ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ హీరో మాత్రం ఇప్పుడు తన సినిమా రెమ్యునరేషన్ పెంచేసినట్లు సమాచారం. తన కొత్త సినిమాకి రామ్ రూ.10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. బైలింగ్యువల్ సినిమా కావడంతో రామ్ ఎక్కువ మొత్తం అడుగుతున్నాడట.

దర్శకుడు లింగుస్వామితో రామ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రామ్ కి ఉన్న మార్కెట్ ను బట్టి ఈ సినిమాను ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేసే ఛాన్స్ ఉంది. డిజిటల్ అండ్ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడవ్వడం ఖాయం. యూట్యూబ్ లో కూడా రామ్ సినిమాలను బాగా చూస్తారు. అతడి హిందీ డబ్బింగ్ సినిమాలకు మిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి.

అందుకే రామ్ ఈసారి తన రెమ్యునరేషన్ పెంచేశారట. మరి ఆయన అడిగినంత మొత్తాన్ని నిర్మాతలు ఇస్తారో లేదో చూడాలి. ఈ సినిమా తరువాత రామ్.. మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని కూడా పలు భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి రామ్ తన మార్కెట్ ను మరింత విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నాడన్నమాట!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus