ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని (Ram) సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) తర్వాత ‘రెడ్’ (RED) అనే సినిమా చేశాడు రామ్. అది పర్వాలేదు అనిపించింది కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ అంత హిట్ అయితే కాదు. ఆ తర్వాత చేసిన ‘ది వారియర్’ (The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఇలా వరుస ప్లాపులు వస్తున్నప్పటికీ రామ్ మాత్రం పారితోషికం విషయంలో తగ్గడం లేదట.
ఇప్పుడు ఒక్కో సినిమాకి రామ్ రూ.25 కోట్ల నుండి రూ.28 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి రూ.22 కోట్లు పారితోషికం అందుకున్నాడు రామ్. ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) దర్శకుడు మహేష్ బాబుతో (Mahesh Babu P) ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ‘మైత్రి..’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం రామ్ రూ.25 కోట్లు డిమాండ్ చేశాడట. అతను చెప్పిన రేటుకి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అయితే దీని తర్వాత రామ్ (Ram Pothineni) ఇంకో సినిమాకి కమిట్ అవ్వలేదు.
ఎందుకంటే అతను నెక్స్ట్ సినిమాలకి రూ.28 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అందుకే హరీష్ శంకర్ తో (Harish Shankar) అనుకున్న సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో పడినట్టు తెలుస్తుంది. తోటి హీరో నాని కన్సిస్టెంట్ గా సూపర్ హిట్లు కొట్టి తీసుకుంటున్న పారితోషికాన్ని.. రామ్ తన మార్కెట్ ను చూపించి డిమాండ్ చేయడం టాలీవుడ్ దర్శకనిర్మాతలకు నచ్చడం లేదు. పైగా రామ్ (Ram Pothineni) ఫైనల్ సెటిల్మెంట్ చేస్తేనే డబ్బింగ్ చెప్పడానికి ఓకే అంటాడట.