Simbu: పెళ్లి చేసుకోబోతున్న కోలీవుడ్ హీరో… అమ్మాయి ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ప్రేమలు పడటం బ్రేకప్ చెప్పుకోవడం సర్వసాధారణం ఇలా ఎంతోమంది హీరోలు తరచూ తమ ప్రేమ బ్రేకప్స్ గురించి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు శింబు కూడా ఇదివరకు ఎన్నోసార్లు ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఈ హీరో ఇదివరకే నయనతార హన్సిక వంటి సెలబ్రిటీలతో ప్రేమలో పడి వారితో బ్రేకప్ చెప్పుకొని వార్తలలో నిలిచారు.

అయితే తాజాగా ఈయన మరొక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరి ప్రేమ విషయం ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులకు తెలియటంతో వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం శింబు శ్రీలంకకు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని సమాచారం ప్రస్తుతం ఆ అమ్మాయి డాక్టర్ చదువుతోందని తన తండ్రి పెద్ద బిజినెస్ మాన్ అని తెలుస్తుంది.

ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి అమ్మాయితో హీరో శింబు ప్రేమలో పడ్డారని త్వరలోనే వీరి పెళ్లి విషయాన్ని అధికారకంగా ప్రకటించబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. మరి శింబు పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో పడి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నటువంటి శింబు ఈసారైనా తన ప్రేమలో సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇక ఈయనతో ప్రేమలో పడినటువంటి నయనతార దర్శకుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి కాగా హన్సిక సైతం తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus