తమిళ హీరో సూర్య మరియు థియేటర్స్ యాజమాన్య సంఘాల మధ్య కొద్దిరోజులుగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హీరో సూర్య తీసుకున్న ఓ నిర్ణయాన్ని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సూర్య నిర్మాతగా తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో పోన్ మగళ్ వందాళ్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే అనుకోకుండా కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో థియేటర్స్ మూతపడ్డాయి. దీనితో ఏమి చేయాలో పాలుపోని సూర్య పోన్ మగళ్ వందాళ్ సినిమాను నేరుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
దీనిని తమిళనాడు మరియు కేరళ థియేటర్స్ అసోసియేషన్స్ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు సూర్య తన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆయన సినిమాలు నిషేదిస్తాం అని హెచ్చరికలు జారీ చేశారు. వీటిని పట్టించుకోని సూర్య అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 29 నుండి పోన్ మగళ్ వందాళ్ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా మొదటి సారి సూర్య తన నిర్ణయం వెనుక కారణం చెప్పి, తను చేసింది కరెక్ట్ అని సమర్ధించుకున్నారు. తనకు 70కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయని ఆయన చెప్పు కొచ్చారు.
ఇలాంటి పరిస్థితులలో ఏమి చేయాలో మీరే చెప్పండి అని వారిని ప్రశ్నించాడు. నా బిజినెస్ నేను చేసుకుంటాను.. అడగడానికి మీరెవరు అని సూర్య కొంచెం గట్టిగానే వారికి చురకలు వేశాడు. నా సినిమాలు ప్లాప్ అయినప్పుడు మీరు నష్టాలు పూడ్చారా అని సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన మాటలు వింటే అర్థం అవుతుంది.