రోజా భర్తకు ఆ స్టార్ హీరో భారీ షాకిచ్చారా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ కు గుర్తింపు ఉంది. ఈ ఏడాది విజయ్ హీరోగా నటించి థియేటర్లలో విడుదలైన బీస్ట్ సినిమా తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో ఫ్లాపైనా విజయ్ కు క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే విజయ్ వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా భర్త సెల్వమణికి భారీ షాక్ ఇచ్చారని కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

రోజ భర్త సెల్వమణి తాజాగా ఒక సందర్భంలో విజయ్ అజిత్ తమ సినిమాల షూటింగ్ లను హైదరాబాద్, వైజాగ్ లలో చేయడం సరికాదని ఈ హీరోలు చెన్నైలోనే తమ సినిమాల షూటింగ్ లు జరిగేలా చూడాలని అన్నారు. ఈ విధంగా చేయడం వల్ల తమిళనాడు రాష్ట్రంలో సినిమా రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు నష్టపోకుండా ఉంటారని సెల్వమణి చెప్పుకొచ్చారు. అజిత్ కు ఈ విషయం చెబితే చెన్నైలోనే షూటింగ్ లు జరిగేలా చూసుకుంటానని అజిత్ చెప్పారని సెల్వమణి వెల్లడించారు.

ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సెల్వమణి అధ్యక్షుడు కావడంతో ఆయన ఈ కామెంట్లు చేశారు. సెల్వమణి చేసిన కామెంట్ల గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతున్న సమయంలోనే విజయ్ హైదరాబాద్ లో కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. సెల్వమణి మాటలను పట్టించుకోకుండా విజయ్ ఈ విధంగా చేసి ఆయనకు భారీ షాకిచ్చారని నెట్టింట కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ తర్వాత సినిమాలతో ఖచ్చితంగా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమిళంలో విజయ్ స్టార్ హీరో అయినా తెలుగులో మాత్రం విజయ్ నటించిన సినిమాలేవీ భారీస్థాయిలో కలెక్షన్లను సాధించలేదు. తెలుగులో మార్కెట్ ను పెంచుకోవాలనే ఆలోచనతో విజయ్ టాలీవుడ్ డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు అవకాశాలను ఇస్తున్నారు. సినిమాసినిమాకు విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Share.