గతంలో తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన విక్రమ్.. అటు తర్వాత తమిళంలో హీరోగా నటిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆయన బాల దర్శకత్వంలో చేసిన ‘శివపుత్రుడు’ 2004 లో విడుదలయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలో విక్రమ్ నటనకు గాను నేషనల్ అవార్డు కూడా లభించింది. అటు తర్వాత 2005లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’ చిత్రం విక్రమ్ ను స్టార్ హీరోని చేసింది.
విక్రమ్ మార్కెట్ పెరగడానికి ఈ సినిమా ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత విక్రమ్ చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు. మళ్ళీ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఐ’ సైతం నిరాశపరిచింది. గతేడాది ఓటీటీలో రిలీజ్ అయిన ‘మహాన్’ అలాగే ‘కోబ్రా’ ‘పొన్నియిన్ సెల్వన్-1’ వంటి చిత్రాలు జస్ట్ ఓకే అనిపించాయి. ఇదిలా ఉండగా… ప్రస్తుతం విక్రమ్ పా రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు.
ఆ పాత్రలో విక్రమ్… చాలా రగ్డ్ లుక్ లోకి మారిపోయాడు. ఈ పాత్ర కోసం 4 గంటల పాటు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడతాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ఐ’ సినిమాలో మూడు రకాల గెటప్ ల కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. అప్పట్లో మేకింగ్ వీడియోల్లో కూడా దానిని ప్రత్యేకంగా చూపించారు. ఇప్పుడు 57 ఏళ్ళ వయసులో కూడా విక్రమ్ అదే విధంగా కష్టపడుతుండడం అతని డెడికేషన్ ఏంటనేది తెలియజేస్తుంది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?