రూ.570 కోట్లా.. పిల్లల కోసం ఖర్చు పెట్టండి : విశాల్
- May 14, 2016 / 10:08 AM ISTByFilmy Focus
తమిళనాట ఎన్నికలు జరుగుతుండగా.. భారీ స్థాయి లో శనివారం డబ్బు పట్టుబడింది. తిరుపూర్ వద్ద దాదాపు రూ.570 కోట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా పట్టుబడిందని, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటం ఆశ్చర్యానికి గురిచేసిందని నటుడు విశాల్ తెలిపాడు.
ఈ మొత్తం డబ్బును పిల్లల చదువుల కోసం, మరియు మధ్యాహ్న భోజన పథకం కోసం ఉపయోగించి.. పిల్లలను ఆదుకోవాలని విశాల్ కోరుతున్నాడు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న ‘మదగజరాజ’, ‘రాయుడు’ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉండగా.. ‘రాయుడు’ చిత్రం తమిళంలో మే 20 న, తెలుగులో మే 27 న విడుదల అవుతోంది.
570 cr seized in Tirupur without documents???🙈🙈🙈😡🙀🙀🙀.wish they use it for children education n mid day meal scheme.wil b enuf for 570cr kids
— Vishal (@VishalKOfficial) May 14, 2016
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











