తెలుగువాడైనా విశాల్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తమిళ్ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకులు విశాల్ కి అభిమానులుగా మారారు. తమిళ భాషలో హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ విశాల్ బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం “లాఠీ చార్జ్”సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
ఈ సినిమాలో విశాల్ ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఆరేళ్ల బాలుడికి తండ్రిగా కూడా నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. వడపళని లోని పలోజా థియేటర్లో ఈ ట్రైలర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతుండగా.. అభిమానులు దళపతి విజయ్ అని కేకలు వేయటం ప్రారంభించారు. అభిమానులు చేసిన పనికి విశాల్ స్పందిస్తూ…
నేను దళపతిని కాను… పురాట్చి దళపతి ని కాను . నేను కేవలం విశాల్ ని మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విశాల్ మాట్లాడుతూ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇప్పటివరకు విశాల్ నటించిన సినిమాలలో భారీ బడ్జెట్ తో తెరికెక్కిన మొదటి చిత్రం ఇదేనని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఈ సినిమా ద్వార ఇద్దరికీ మంచి పేరు వస్తుందని.. ఒకరు ఈ సినిమాకు సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా, మరొకరు ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా పనిచేసిన మాస్టర్ పీటర్ హెయిన్స్ అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో చాలాసార్లు గాయపడినట్లు విశాల్ వెల్లడించాడు. ఈ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్. వినోద్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు ప్రారంభించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో ఈనెల 22వ తేదీ ఈ సినిమా విడుదల చేయగా … హిందీ భాషలో ఈనెల 30వ తేదీ విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.