Vishwak Sen: సరికొత్త గెటప్ లో విశ్వక్ సేన్.. కొత్త సినిమా లుక్ వైరల్.!

టాలీవుడ్లో చాలా మంది హీరోలు లేడీ గెటప్..లు వేసిన సందర్భాలు ఉన్నాయి. ‘చంటబ్బాయి’ (Chantabbai) సినిమాలో చిరంజీవి (Chiranjeevi) , ‘గంగోత్రి’ (Gangotri) సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) , ‘మేడమ్’ సినిమాలో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) , ‘కితకితలు’ సినిమాలో అల్లరి నరేష్ (Allari Naresh) , ‘పాండవులు పాండవులు తుమ్మెద’ (Pandavulu Pandavulu Tummeda) సినిమాలో మంచు మనోజ్ (Manchu Manoj) వంటి వారితో పాటు ఇంకా చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా ఈ లిస్ట్ లో చేరాడు అని చెప్పాలి. అవును విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.

అదే ‘లైలా’ (Laila) మూవీ. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ కాగా.. జిబ్రాన్, తనిష్క్ (Tanishk Bagchi) సంగీతం అందిస్తున్నాడు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 2025 ఫిబ్రవరి 14 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేసారు మేకర్స్. మరోపక్క విశ్వక్ సేన్ లేడీ గెటప్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.

‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi) బ్రహ్మానందం ట్రాక్ వచ్చినప్పుడు ‘వాడే హీరో మన కర్మకి వాడే హీరోయిన్ కూడా..’ అంటూ రఘుబాబు చెప్పే డైలాగ్ తో విశ్వక్ సేన్ లేడీ గెటప్ పిక్ ను ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ ఏడాది ‘గామి’ (Gaami) వంటి హిట్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) వంటి యావరేజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్.. ‘లైలా’ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus