జయాపజయాలు దైవాధీనం అని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఎవ్వరికైనా.. హిట్స్,ప్లాప్స్ అనేవి సర్వసాధారణం అని ప్రేక్షకులు అనుకుంటారు. ఒకప్పుడు ఏమో కానీ.. ఇప్పుడు ఒక డిజాస్టర్ పడితే కెరీర్ ఎలా అయిపోతుందో చెప్పలేని పరిసితి. ముఖ్యంగా హీరోలు కచ్చితంగా హిట్ కొడితేనే మార్కెట్ స్టాండర్డ్ గా ఉంటుంది. లేదు అంటే అగమ్యగోచరమే. విషయంలోకి వెళితే.. 2025లో కొన్నేళ్ళుగా ప్లాపులతో సతమతమవుతున్న హీరోలు హిట్లు కొట్టి కంబ్యాక్ ఇచ్చారు.
భారీ డిజాస్టర్ల తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి, ‘మేం ఇంకా ఫామ్‌లోనే ఉన్నాం’ అని ప్రూవ్ చేసుకున్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) విక్టరీ వెంకటేష్:

‘సైందవ్’ తో పెద్ద డిజాస్టర్ చూశాడు వెంకటేష్. 2024 సంక్రాంతి బరిలో దిగిన ఆ సినిమా నిలబడలేకపోయింది. సరిగ్గా ఏడాది తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ యాక్షన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో 2025 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
2) నాగ చైతన్య:

‘థాంక్యూ’ ‘కస్టడీ’ వంటి ప్లాపులతో కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడుతున్న నాగ చైతన్యకు ‘తండేల్’ రూపంలో సాలిడ్ సక్సెస్ దక్కింది. శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో రియల్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా, చైతూ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది.
3) పవన్ కళ్యాణ్:

పొలిటికల్ బ్రేక్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది డిజాస్టర్ అయ్యింది. అయితే రెండు నెలల్లోనే ఓజితో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ కళ్యాణ్ కి ఓ మంచి హిట్ ఇచ్చింది. 2025 హయ్యెస్ట్ గ్రాసర్స్ లో ఇది కూడా ఒకటి.
4) ప్రియదర్శి:

‘డార్లింగ్’ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ప్రియదర్శి, ‘కోర్ట్’ అనే లీగల్ డ్రామాతో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో నటుడిగా తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.
5) కిరణ్ అబ్బవరం:

‘దిల్ రూబా’ తో డిజాస్టర్ చూసిన కిరణ్ కి.. ‘కె-ర్యాంప్’ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది అని చెప్పాలి. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది.
6) శ్రీవిష్ణు:

‘శ్వాగ్’ తో ఆశించినంత సక్సెస్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు, ‘సింగిల్’ మూవీతో కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ అతను ఫామ్లోకి వచ్చినట్టు అయ్యింది.
7) సుమంత్:

హీరోగా ఈ మధ్య సరైన సక్సెస్ లేకుండా అల్లాడుతున్నారు సుమంత్.కొంత గ్యాప్ తర్వాత సుమంత్ హీరోగా చేసిన ‘అనగనగా’ అతనికి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ ఫ్యామిలీ డ్రామా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెద్ద హిట్ అయింది.
8) బెల్లంకొండ సాయి శ్రీనివాస్:

బాలీవుడ్ ఎంట్రీ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో వచ్చిన ‘భైరవం’ డిజప్పాయింట్ చేసింది. అయితే ‘కిష్కింధపురి’ అనే హర్రర్ థ్రిల్లర్ తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.
9) నారా రోహిత్:

హీరోగా రోహిత్ కెరీర్లో గ్యాప్ వచ్చింది. 5 ఏళ్ళ తర్వాత చేసిన ‘ప్రతినిధి 2’ కూడా డిజప్పాయింట్ చేసింది. అయితే ‘భైరవం’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వచ్చిన ‘సుందరకాండ’ సినిమా క్రిటిక్స్ ని మెప్పించి.. బాక్సాఫీస్ వద్ద కూడా పర్వాలేదు అనిపించింది.
10) తిరువీర్:

‘పరేషాన్’ వంటి ఫ్లాప్ తర్వాత తిరువీర్ హీరోగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వచ్చింది. ఇది డీసెంట్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ఇంపాక్ట్ చూపించింది.
11) ఆది సాయి కుమార్:

వరుస పరాజయాలతో ఆది అడ్రెస్ గల్లంతయ్యింది. ఇక హీరోగా కష్టం అనుకున్న టైంలో ‘శంబాల’ ఇతనికి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఈ డివోషనల్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
