బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్య అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో నయనతారను మేకర్స్ హీరోయిన్ గా ఫైనల్ చేశారని సమాచారం అందుతోంది. బాలయ్య నయనతార కాంబినేషన్ లో ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. అయితే సాధారణ హీరోయిన్లతో పోల్చి చూస్తే నయనతార రెమ్యునరేషన్ ఎక్కువనే సంగతి తెలిసిందే. నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
మరి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసి నయనతారను ఈ సినిమాకు ఎంపిక చేస్తారేమో చూడాల్సి ఉంది. నయనతార సినిమాలో నటించినా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపరనే సంగతి తెలిసిందే. పెళ్లైనా నయనతారకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. నయనతారను సినిమాలో ఎంపిక చేయడం వల్ల ఆ సినిమాలకు ఇతర భాషల్లో కూడా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
నయనతార సైతం ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కథ నచ్చితే మాత్రమే నయనతార కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సీనియర్ హీరోయిన్లలో ఏ హీరోయిన్ కు లేని స్థాయిలో నయనతార క్రేజ్ ను సంపాదించుకున్నారు. నయనతార లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కెరీర్ విషయంలో ఈ స్టార్ హీరోయిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!