Pushpa Songs: పుష్పపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేఖా భోజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప సినిమా నుంచి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ కాగా నాలుగు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పుష్ప పాటలలో సామి సామి సాంగ్ ఒకటి కాగా నటి రేఖా భోజ్ సామి సామి కవర్ సాంగ్ లో నటించారు. ఇప్పటికే రేఖా భోజ్ పలు సినిమాల్లో నటించినా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం రేఖా భోజ్ యాక్టివ్ గా ఉంటున్నారు.

ఒరిజినల్ సాంగ్ కు గట్టి పోటీ ఇచ్చేలా రేఖా భోజ్ సాంగ్ ఉండటం గమనార్హం. అయితే కవర్ సాంగ్ చేయడం కోసం రేఖా భోజ్ తన రెండు గాజులు అమ్ముకున్నారని సమాచారం. సామి సామి కవర్ సాంగ్ ను చాలా కష్టపడి చేశానని ఈ సాంగ్ కొరకు గాజులు కూడా అమ్ముకున్నానని కవర్ సాంగ్ నచ్చితే సోషల్ మీడియాలో షేర్ చేసి సపోర్ట్ చేయాలని రేఖా భోజ్ చెప్పుకొచ్చారు. కవర్ సాంగ్ లో రేఖా భోజ్ డ్యాన్స్, లొకేషన్స్, కట్టు బొట్టు బాగున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లో రేఖా భోజ్ కవర్ సాంగ్ కు 28,000కు పైగా వ్యూస్ వచ్చాయి. థిల్లానా అనే సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రేఖా భోజ్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. యూట్యూబ్ ఛానల్ కు తక్కువ సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ఉండటం రేఖా భోజ్ కు మైనస్ అవుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు వస్తే రేఖా భోజ్ కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. రేఖా భోజ్ సోషల్ మీడియా ద్వారా వేర్వేరు అంశాల గురించి స్పందిస్తూ తన మనస్సులోని భావాలను వ్యక్తపరుస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus