రీమేక్ సినిమాల హవా ఈ మధ్య కొంచెం తగ్గింది. అలా అని ఆగిపోలేదు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వంటి రీమేక్ లు అక్కడక్కడా వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాల వల్ల.. అన్ని సినిమాలు కూడా ప్రతి భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా.. ఓటీటీల్లో వస్తూనే ఉన్నాయి. అందులో భాషను ఎంపిక చేసుకుని… హ్యాపీగా చూసేయొచ్చు. అందుకే రీమేక్ సినిమాల హవా తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ ఇలాంటి టైంలో ఓ హిందీ సినిమాపై మన యంగ్ హీరోలైన రానా (Rana Daggubati) , (Varun Tej) వరుణ్ తేజ్ (Varun Tej) , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) వంటి వారు మనసుపారేసుకున్నట్టు స్పష్టమవుతుంది.
వివరాల్లోకి వెళితే… ‘కిల్’ (Kill) అనే హిందీ సినిమా మొన్నామధ్య రిలీజ్ అయ్యింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మొదట దాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్ తో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా నిలదొక్కుకుంది. కథగా చెప్పుకోడానికి ఆ సినిమాలో ఏమీ ఉండదు. చిన్న పాయింట్.. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. విపరీతమైన వయొలెన్స్ ఉన్నప్పటికీ.. ఎమోషన్స్ బాగా పండాయి.
అందుకే ఈ సినిమాని కొన్ని మార్పులతో రీమేక్ చేస్తే.. వర్కౌట్ అవుతుందని నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. ముందుగా ఆయన రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారు. ఆయనకి నిర్మించే ఇంట్రెస్ట్ లేదు అంటే.. వేరే నిర్మాతలకు రేటు పెంచి అమ్మేస్తారు అని తెలుస్తుంది. చూడాలి మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో.