కరోనా నుండీ కోలుకున్న సూర్య : రాజమౌళి పై శ్రీదేవి భర్త ఫైర్ : ‘రాధే శ్యామ్’ నయా అప్డేట్

ఇటీవల స్టార్ హీరో సూర్య కరోనా భారిన పడినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కోలుకున్నట్టు తాజాగా అతని తమ్ముడు అలాగే హీరో అయిన కార్తీ ప్రకటించాడు. ప్రస్తుతం ‘అన్నయ్య ఆరోగ్యం బాగానే ఉందని, అంతా క్షేమమని, ఈరోజు కరోనా నెగిటివ్ వచ్చిందని, మీ ప్రార్థనలు ఫలించాయని, మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే’ అంటూ కార్తీ చెప్పుకొచ్చాడు.

రాజమౌళి పై శ్రీదేవి భర్త అలాగే ప్రముఖ నిర్మాత అయిన బోణి కపూర్ మండిపడ్డాడు. తాను రూపొందించిన ‘మైదాన్’ చిత్రం రిలీజ్ రోజునే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడని.. నాతో కనీసం డిస్కస్ చెయ్యకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడని, తరువాత నేను రిక్వెస్ట్ చెయ్యగా… ‘రిలీజ్ డేట్ నా చేతిలో లేదని’ అబద్దాలు చెబుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం హిందీ వెర్షన్ కు మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడని.. ఇక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నట్టు దర్శకనిర్మాతలు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ప్రకటించారు.

అనసూయకి అరుదైన గౌరవం దక్కింది. ‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్’ ఆమె ఫొటోతో పోస్టల్ స్టాంప్ ను రూపొందించి సత్కరించింది. ఇందులో.. అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడించడం విశేషం. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుండీ గుచ్చే గులాబీ సాంగ్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఫిబ్రవరి 13న ఫుల్ సాంగ్ ను విడుదల చెయ్యబోతున్నారు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రేపు విడుదల కాబోతున్న ‘ఉప్పెన’ చిత్రానికి టికెట్ రేట్లు పెంచేశారు. ఐమాక్స్ లో 350 రూపాయలకు … మిగిలిన మల్టీప్లెక్స్ లలో 200 నుండి 250 రూపాయలు.. సింగిల్ స్క్రీన్ లలో అయితే 150 రూపాయల వరకూ ‘ఉప్పెన’ టిక్కెట్ రేట్ పలుకుతుంది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బోయపాటి శ్రీను డైరెక్షన్లో మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుందట. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus