‘పుష్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్ : ప్రభాస్ తో శృతీ హాసన్ రొమాన్స్ అఫీషియల్ : సమ్మర్ బరిలో గోపీచంద్ ‘సీటిమార్’

‘అల వైకుఠ‌పురములో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ త‌రువాత‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్ప’‌. ‘మైత్రీ మూవీ మేకర్స్’ మరియు ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఆగష్ట్ 13న విడుద‌ల చేయ‌బోతున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు.తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ మ‌రియు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుదల కాబోతుంది ఈ చిత్రం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతీ హాసన్ ను ఎంపిక చేసినట్టు గత కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ‘సలార్’ టీం శృతీ హాసనే హీరోయిన్ అని ఫైనల్ చేసింది. ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో దర్శకనిర్మాతలు ఇలా సర్ప్రైజ్ చేసినట్టు స్పష్టమవుతుంది.

యాక్షన్ హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో తెరకెక్కుతోన్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా ఏప్రిల్‌ 2న విడుదల చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో ‘హిప్పీ’ హీరోయిన్ దిగంగన సూర్య వంశీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus