ట్యాక్స్ కట్టడానికి డబ్బుల్లేవ్ : ‘మగధీర’ కథతో ‘ఆర్.ఆర్.ఆర్’ : టాలీవుడ్లో పొరుగు దర్శకుల హవా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆదాయపు పన్ను చెల్లించలేకపోతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది కంగనా. కరోనా, లాక్ డౌన్ కారణంగా గతేడాదిగా షూటింగ్ లో పాల్గొనలేదని.. దీంతో సరిపడా డబ్బులు లేక పూర్తి స్థాయిలో పన్ను చెల్లించలేదని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రాజమౌళి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మగధీర సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. పునర్జన్మ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు మగధీర సినిమాలో ఉండే ట్విస్టులు అన్నీఇన్నీ కావు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా పునర్జన్మ కథాంశంగా తెరకెక్కనుందని సమాచారం. ఎన్టీఆర్, తారక్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పొరుగింటి పుల్లగూర రుచి అనే నానుడి సినిమా పరిశ్రమకు బాగా సూటవుతుంది అంటుంటారు మన పెద్దలు. హీరోయిన్లు, విలన్లు, దర్శకులు.. ఇలా అందరినీ పొరుగింటి నుండి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఇతర భాషల నుండి దర్శకులు రావడం ఎక్కువైంది. ప్రస్తుతం టాక్స్‌లో ఉన్న సినిమాలు, అనౌన్స్‌ అయిన సినిమా లిస్ట్‌ చూస్తుంటే పొరుగు దర్శకుల జోరు మన ఇండస్ట్రీలో ఊపందుకున్నట్లు అర్థమవుతోంది. ఇతర ఇండస్ట్రీల నుండి మన దగ్గరకు దర్శకులు రాకూడదని ఏమీ లేదు. మనవాళ్లు కూడా అక్కడికి వెళ్తుంటారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవన్ కళ్యాణ్ సమంత హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి సంగతి తెలిసిందే. ఈ సినిమా మినహా పవన్, సమంత మరో సినిమాలో కలిసి నటించలేదు. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని సమాచారం. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఏదైనా సినిమా హిట్‌ అయ్యాక అందులో హీరోయిన్‌కు ఓవర్‌నైట్‌ ఫేమ్‌ రావడం సహజం. కొంతమంది హీరోయిన్లు సినిమా విజయం సాధించిన కొన్ని రోజుల తర్వాత జోరు మొదలుపెడతారు. అలాంటివారిలో మాళవిక మోహనన్‌ ఒకరు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ‘పట్టం పోలే’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్‌ తర్వాత చాలా సినిమాలు చేసింది. అయితే మనవాళ్ల దృష్టిలో పడింది మాత్రం ‘మాస్టర్‌’తోనే. ఆ సినిమా వచ్చి ఐదు నెలల తర్వాత ఇప్పుడు మాళవికకు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus