RRR Movie: ఆ ఫార్ములానే మళ్లీ నమ్ముకున్న జక్కన్న..?

రాజమౌళి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మగధీర సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. పునర్జన్మ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు మగధీర సినిమాలో ఉండే ట్విస్టులు అన్నీఇన్నీ కావు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా పునర్జన్మ కథాంశంగా తెరకెక్కనుందని సమాచారం. ఎన్టీఆర్, తారక్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాహుబలి2 తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా సక్సెస్ విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి లీకవుతున్న విషయాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్, కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ చనిపోయి మళ్లీ పుట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని సమాచారం.

రాజమౌళి ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు పోస్ట్ పోన్ అయినట్టు వార్తలు వస్తున్నా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను బట్టి తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఇతర సినిమాల దర్శకనిర్మాతలు భావిస్తుండగా జక్కన్న ఏ తేదీకి సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అవుతారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus