2021 ఫస్ట్ హాఫ్ : భార్య అకౌంట్ నుండీ కోటి కొట్టేసాడు : తీరని ప్రభాస్ హీరోయిన్ కోరిక

ఒకప్పుడు ఏడాదిలో ఆరు నెలలు పూర్తవుతున్నాయంటే… ఆ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎంత టైమ్ ఇచ్చినా సరిపోదు, ఎంత రాసినా ఇంకా మిగిలే ఉంటుంది. అయితే ఈ మాయదారి కరోనా వల్ల సినిమా పరిశ్రమలో నిలకడ లేకుండాపోయింది. వంట అంతా సిద్ధం చేసుకొని… తినడానికి వడ్డిద్దాం అంటే ‘బూ’ (చైనీస్‌లో నో అని అర్థం) వచ్చేస్తోంది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా ఆరు నెలల్లో అరకొర వినోదమే దిక్కయింది. 2021లో ఆరు నెలలు పూర్తవుతున్న సమయంలో ఈ ఏడాది ఇప్పటివరకు వెండితెరపై వచ్చిన సినిమాలు, వాటి సంగతులు చూద్దాం..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

ప్రముఖ బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా తన భార్యకు తెలియకుండా ఆమె అకౌంట్ నుండి డబ్బులు విత్ డ్రా చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడు డ్రా చేసిన డబ్బులు వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోటి రూపాయలు. విషయం తెలుసుకున్న కరణ్ భార్య నిషా.. గోరేగావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కరణ్ తో పాటు అతడికి సహకరించిన ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దశాబ్దానికి పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సంజనా గల్రానీ హీరోయిన్ గా చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదనే సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బుజ్జిగాడు సినిమా సంజనా గల్రానీకి అంతోఇంతో గుర్తింపును తెచ్చిపెట్టింది. గతేడాది డ్రగ్స్ కేసు వివాదంలో చిక్కుకోవడం ద్వారా సంజనా గల్రానీ వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఈ బ్యూటీకి మల్టీ లింగ్వల్ మూవీలో ఆఫర్ వచ్చింది. వెంకట్ కృష్ణన్ డైరెక్షన్ లో మణిశంకర్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో సంజన నటిస్తుండగా తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల కానుందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్ 5 తెలుగు ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సీజన్ 2ను నాని హోస్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4లకు సీనియర్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5ను మాత్రం నాగార్జున హోస్ట్ చేయరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తేజ డైరెక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కిన జయం సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన సదా ఈటీవీలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా షోకు హాజరై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సదా సినీ కెరీర్ లో జయం, అపరిచితుడు బిగ్గెస్ట్ హిట్లు కాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాగ సినిమాలో, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరభద్ర సినిమాలో సదా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సదాకు సినిమా ఆఫర్లు తగ్గగా జూనియర్ ఎన్టీఆర్ లా డ్యాన్స్ చేసేవారిని తాను ఇంతవరకు చూడలేదని సదా అన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus