బెంజ్ కార్ కొట్టేసిన బుచ్చి : మనవళ్ల కోసం కింగ్ వెయిటింగ్ : అల్లూరి కొత్త లుక్

‘ఉప్పెన‌’ చిత్రం ఫిబ్రవరిలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు కృతిశెట్టి కూడా హీరోయిన్‌గా పరిచయమైంది. రొటీన్ కథే అయినప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు సానా ట్రీట్మెంట్ యూత్ ను చాలా బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రం రూ.85కోట్ల గ్రాస్ కలెక్షన్లను అలాగే రూ.50కోట్ల పైగా షేర్ ను నమోదుచేసింది.’ మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు.ఇదిలా ఉండగా..తాజాగా దర్శకుడు బుచ్చి బాబు సానాకు నిర్మాతలు బెంజ్ జిఎల్సి కారును బహుమతిగా ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

మనవడు లేదా మనవరాలి కోసం కింగ్ నాగార్జున ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాడట. అసలు నాగార్జునేంటి.. అప్పుడే తాతయ్యగా మారడం ఏంటి అని అంతా విడ్డూరంగా అనుకోవచ్చు. అయితే మన కింగ్ నాగార్జునకు 61ఏళ్ళ వయసు. ఆయన గ్లామర్ పరంగా 30 ఏళ్ళ వ్యక్తిగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది డైజెస్ట్ చేసుకోవాల్సిన నిజమే..! అందులోనూ పెద్ద కొడుకుకి పెళ్ళై 4ఏళ్ళు కావస్తోంది. అందుకే తన మనసులోని మాటను బయటపెట్టాడు నాగార్జున. ఇటీవల ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్లలో భాగంగా గంగవ్వ యాంకర్ గా నాగార్జునని ఇంటర్వ్యూ చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రేపు మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు కావడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ చరణ్ కు సంబంధించి మరో లుక్ ను విడుదల చేసాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ లుక్ ను చూసిన అభిమానులకు గూజ్ బంప్స్ రావడం గ్యారెంటీ అనే చెప్పాలి. ఈ స్పెషల్ పోస్టర్ లో రాంచరణ్ అలియాస్ అల్లూరి సీతారామ రాజు.. విల్లంబును ఎక్కు పెట్టి చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రాజమౌళి ఈ పోస్టర్ ను ట్వీట్ చేస్తూ, ‘ధైర్యం, గౌరవం, సమగ్రత… కలిగిన నా సీతారామరాజును మీకు పరిచయం చేస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు. ఇక ఇదే పోస్టర్ ను మరో హీరో ఎన్టీఆర్ పోస్ట్ చేస్తూ.. ‘గొప్ప లక్షణాలు ఉన్న సోదరుడు ఇతను’ అంటూ కామెంట్ చేసాడు. ఇక ఈ లుక్ పై రాంచరణ్ స్పందిస్తూ.. ‘అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించడం నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

లంగా వోణిలో వరలక్ష్మీ శరత్ కుమార్.. ఫోటోలు వైరల్..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus