2021 సంవత్సరంలో రిలీజవుతున్న భారీ బడ్జెట్, బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా ఆచార్య సినిమా పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే సినిమాలో నటిస్తుండటం, ఇద్దరు హీరోలు ఫుల్ లెంగ్త్ రోల్ లో కలిసి నటిస్తున్న తొలి సినిమా ఆచార్య కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను తగినట్లే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం రికార్డు స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది.
ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర కేవలం 20 నిమిషాలకే పరిమితమవుతుందని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చినా దాదాపు సెకండాఫ్ అంతా చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది. నిజ జీవితంలో చిరంజీవి, చరణ్ తండ్రీకొడుకులు అయినప్పటికీ సినిమాలో మాత్రం వేరే పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. చరణ్ పూజా హెగ్డే మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ఉండగా ఆ సాంగ్ సినిమాకు హైలెట్ కానుందని ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన లాహే లాహే సాంగ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఆచార్య సినిమాకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే ఉండగా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తే సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉంది. ఆచార్య మెయిన్ ఎమోషన్ చరణ్ దేనని సమాచారం. దీంతో ఆచార్యలో మెయిన్ హీరో చిరంజీవి కాదా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!