SSMB29 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ, తెలుగుతో పాటు హాలీవుడ్ స్థాయిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్ స్కౌటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన విలన్ పాత్రపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటి వరకు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారనే ప్రచారం ఉన్నా, రాజమౌళి ప్రత్యేకతని బట్టే ఈ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు.
రాజమౌళి గతంలో ఇమేజ్ లేని నటులను ఎంపిక చేసి ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావం చూపించాడు. ఇక ఈసారి స్టోరీ ఆఫ్రికన్ అడవుల్లో సాగే థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఉండబోతున్న నేపథ్యంలో, ఒక నల్ల జాతీయుడు విలన్‌గా ఎంపిక కావచ్చన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. తాజాగా ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు డ్జిమోన్ హౌన్సౌ ఎంపికయ్యారని సమాచారం. ఇటీవల లండన్ వెళ్లిన రాజమౌళి, అక్కడ డ్జిమోన్‌తో సీక్రెట్‌గా సమావేశమయ్యారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
డ్జిమోన్‌ను ఒక ఆఫ్రికన్ హంటర్ పాత్రలో చూపించబోతున్నారని సమాచారం. ఈ పాత్ర మహేష్‌ను హుంకరిస్తూ వెంబడించేలా ఉండగా, భయాన్ని కలిగించేలా డిజైన్ చేశారని టాక్. ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో ఈ వార్తలు వైరల్ కావడం, టాలీవుడ్‌లోనూ డ్జిమోన్ గురించి సెర్చ్‌లు పెరగడం విశేషం. డ్జిమోన్ హౌన్సౌ ఒక అనుభవజ్ఞుడైన నటుడు. ‘గ్లాడియేటర్’, ‘బ్లడ్ డైమండ్’, ‘షాజాం’, ‘రిబెల్ మూన్’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
రెండు దశాబ్దాలుగా హాలీవుడ్‌లో నిలకడగా కొనసాగుతున్న ఆయన, ఈ సినిమాతో ఇండియన్ ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వబోతున్నాడు. మాస్ అప్పీల్, యాక్షన్ ఇంటెన్సిటీ కలిగిన విలన్ కోసం రాజమౌళి చేసిన ఈ ఎంపిక కథకు సరిగ్గా సరిపోతుందని పరిశ్రమ విశ్లేషిస్తోంది. SSMB29 కోసం రాజమౌళి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకున్నదే. ఇక డిజిమోన్ హౌన్సౌ ఈ సినిమా కోసం ప్రధాన ప్రతినాయకుడిగా మారితే, అది మరో సూపర్ హైలైట్ అవుతుంది.