Honey Rose, Balayya: చేతులు మెలివేసి వైన్‌ గ్లాప్‌ పట్టి.. బాలయ్య, హనీ హంగామా!

బాలకృష్ణ ఊరమాస్‌.. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా అంటారు. తాను మద్యం తీసుకుంటానని బహిరంగంగానే చెబుతుంటారు. అయితే అది ప్రత్యేక సందర్భాల్లోనే, ప్రత్యేక సమయంలో మాత్రమే అని కూడా చెబుతుంటారు. అలాంటి ప్రత్యేక సందర్భంగా ఆదివారం రాత్రి వచ్చింది. తను హీరోగా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయం అందుకుంది. దీంతో చిత్రబృందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఆ తర్వాత ఆఫ్టర్‌ పార్టీ కూడా జరిగింది.

పార్టీ సంగతి ముందుగా చెప్పలేదు కానీ.. ఆ పార్టీకి వచ్చిన వాళ్ల సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ చూస్తే రాత్రి పొద్దుపోయాక పార్టీ జరిగింది అని తెలుస్తోంది. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న చాలామంది ఈ పార్టీకి హాజరయ్యారని సమాచారం. బాలకృష్ణ, విశ్వక్‌సేన్‌, హనీరోజ్‌ ఇలా చాలామంది పార్టీకి వచ్చారు. ఈ పార్టీలో ఓ ఫొటో హైలైట్‌గా నిలిచింది. ఆ ఫొటోను హనీ రోజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఫొటో వైరల్‌గా మారింది

బాలయ్య, హనీ రోజు చేతుల్లో రెండు వైన్‌ గ్లాస్‌లు ఉన్నాయి. అయితే ఆ చేతులు ఎప్పటిలా లేవు, అదేదో సినిమాలో చూపించినట్లు ఇద్దరు చేతులు పెనవేసుకుని ఉన్నాయి. అలా ఆ వైన్‌ గ్లాస్‌లను ఇద్దరూ సిప్‌ చేస్తున్నట్లు ఫొటో దిగారు. ఆ ఫొటోనే హనీ రోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆ ఫొటోను బాలయ్య అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. మా బాలయ్య ఊర మాస్‌ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బి అవుతున్నారు.

హనీ రోజ్‌ ఆ ఫొటోను షేర్‌ చేస్తూ.. విశ్వక్‌సేన్‌ పేరును ట్యాగ్‌ చేశారు. అయితే ఆ పార్టీ విశ్వక్‌సేన్‌కి సంబంధించిన ప్లేస్‌లో జరిగి ఉండాలి. లేదంటే ఆ ఫొటోను విశ్వక్‌సేన్‌ తీసి ఉండాలి అంటున్నారు. ఏదైతే ఏముంది సినిమాలో బాలయ్య, హనీ రోజ్‌ మధ్య రొమాన్స్‌ మిస్‌ అయ్యిందని బాధపడుతున్న ఫ్యాన్స్‌ ఈ ఫొటోతో ఫుల్‌ ఖుష్‌ అయిపోయారు అని చెప్పాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus