Manchu: మంచు వాళ్ల కొత్త గేమ్‌ షో.. టీజర్‌ చూశారా? స్పెషల్‌ ఏంటంటే?

‘ఇదిగో ఇళ్లలోకి వచ్చి గొడవలు చేస్తారండీ..’ అంటూ ఆ మధ్య సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు మంచు మనోజ్‌. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే విషయంలో క్లారిటీ లేకపోయినా.. మంచు మనోజ్‌ మీద మంచు విష్ణు ఆగ్రహంతో ఉన్నాడని మాత్రం అర్థమైంది. దానికి ‘అది అన్నదమ్ముల గొడవ, ఆపడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ మోహన్‌బాబు క్లారిటీ ఇచ్చి క్లోజ్‌ చేసేశారు. ఆ తర్వాత మనోజ్‌ మళ్లీ ఏవో కామెంట్స్‌ చేసి ఆ గొడవ అక్కడితో ఆగలేదు అని చెప్పాడు.

అయితే ఇక్కడివరకు అంతా సీరియస్‌గా సాగింది. అయితే ఇప్పుడు విష్ణు దీనికి కామెడీ టచ్‌ ఇచ్చాడు. హౌస్‌ ఆఫ్‌ మంచుస్‌ అంటూ ఓ వీడియోను గురువారం సాయంత్రం మంచు విష్ణు రిలీజ్‌ చేశాడు. అందులో తొలుత మనోజ్‌ వీడియోనే కనిపించింది. కట్‌ చేస్తే.. దాని గురించి టీవీల్లో వచ్చిన వార్తలు కనిపించాయి. మళ్లీ కట్‌ చేస్తే.. మంచు వారి అదిరిపోయే రాజభవనం కనిపించింది. ‘నేను మంచు విష్ణు.. మోహన్‌బాబు తనయుడిని’ అంటూ విష్ణు పరిచయం సాగుతుంది.

ఆ తర్వాత మోహన్‌బాబు కుటుంబం ఇంట్లో ఎలా ఉంటారు అనే విషయాన్ని వీడియో చూపించారు. దినచర్యలన్నీ అందులో కవర్‌ చేశారు. ఆఖరిగా ఇదొక రియాలిటీ షో అని చెబుతూ.. త్వరలో స్ట్రీమింగ్‌ అని అనౌన్స్‌ చేశారు. దీంతో మొన్న మనోజ్‌ చేసింది ప్రాంకా అని అడుగుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ రాకపోయినా ఓ అమెరికా టీవీ షో తరహాలో ఓ షో ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. అంటే అమెరికాలో కర్దాషియన్స్‌ అనే షో గురించి తెలిసే ఉండొచ్చు.

ఇంచుమించు అలాగే ‘మంచు’ (Manchu) వారి ఇంటి సంగతులు ఈ షోలో చెబుతారు అంటున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో ఈ రియాలిటీ షో వస్తుంది అంటున్నారు. అయితే, ఒక్కటే డౌట్‌.. విష్ణు టీమ్‌ చెబుతున్నట్లు ఇది షో అయితే.. అందులో ఎక్కడా మనోజ్‌ కనిపించలేదు. కేవలం తొలి సెకన్లలో మాట తప్ప. షోకి, మనోజ్‌ వీడియోకి లింక్‌ చేసి.. ఇదంతా ఉత్తుత్తి విషయమే జనాల్ని మభ్యపెట్టబోతున్నారా? లేక రియాలిటీ షోలో మనోజ్‌ కూడా ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus