ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేసిన స్టార్ హీరోలను చూసిన పరిశ్రమ మనది. ఆ తర్వాత తర్వాత సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇండస్ట్రీలో నిర్మితమవుతున్న సినిమాల కౌంట్ పెరుగుతోంది కానీ… స్టార్ హీరోల సినిమాలు పెరగడం లేదు. రాను రాను అవి ఏడాదికి ఒకటి, మరీ అయితే రెండుగా మారిపోయింది. కరోనా వచ్చాక అయితే పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్లు కొంతమంది తెరపై కనిపించి ఎన్ని రోజులైందో చూద్దామా?
* చిరంజీవి – 685 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘సైరా’లో)
* బాలకృష్ణ – 606 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘రూలర్’లో)
* మహేష్‌బాబు – 584 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘’సరిలేరు నీకెవ్వరు’లో)
* ప్రభాస్ – 718 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘సాహో’లో)
* తారక్ – 1041 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘అరవింద సమేత’లో)
* అల్లు అర్జున్ – 583 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘అల వైకుంఠపురములో..’లో)
* రామ్‌చరణ్- 949 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘వినయ విధేయ రామ’లో)
* నాగచైతన్య – 613 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘వెంకీమామ’లో)
* నాని – 704 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘వి’లో)
* విజయ్‌దేవరకొండ – 550 రోజులు (ఆఖరిగా కనిపించింది ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో)