చియాన్ విక్రమ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అపరిచితుడు’ చిత్రాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రం వచ్చి 15 ఏళ్ళు కావస్తున్నప్పటికీ.. ఇది ఓ క్లాసిక్ అనే చెప్పాలి. దర్శకుడు శంకర్ టేకింగ్ అలగే విక్రమ్ నటన ఆ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్ళింది. ఈ చిత్రంలో విక్రమ్ ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఇతనికి తెలీకుండానే ఇతనిలో మరో రెండు రకాల మనుషులు ఉంటారు. దీనికి కారణం.. ‘చిన్నప్పుడు తన చెల్లి స్కూల్ కి వెళ్లి.. వర్షం కురుస్తున్నప్పుడు రిక్షాలో తిరిగి వస్తుంటే.. ఓ రోడ్డు నీటితో నిండిపోతుంది.
అందులో కరెంటు వైర్ పడి ఉండడంతో హీరో చెల్లి వస్తున్న రిక్షా అదుపు తప్పి ఆ నీళ్లలో పడుతుంది. దాంతో హీరో చెల్లికి కరెంట్ షాక్ కొట్టడం వల్ల చనిపోతుంది. అందుకే విక్రమ్ అలాంటి వ్యాధికి గురవ్వుతాడు. ఇక్కడ అంత వర్షం పడుతుంటే.. పవర్ ఆఫ్ చెయ్యకుండా ఉండే లైన్ మెన్, మద్యం తాగి రిక్షా నడిపిన వ్యక్తిని.. శిక్షించాలని తన తండ్రి వాదించినా న్యాయం జరుగదు. ఇదిలా ఉండగా .. ఇక క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్లు ట్రైన్లో ఉన్నప్పుడు కొందరు మందు కొట్టడానికి వస్తుంటే.. వాళ్ళని హీరో చంపేస్తాడు. దాంతో మళ్ళీ ఇతనిలోకి ‘అపరిచితుడు’ వచ్చాడు.. మళ్ళీ సీక్వెల్ ఉంటుంది అని అంతా అనుకున్నారు.
.లేదా ‘అపరిచితుడు’ ఇక పోడు అని అంతా ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఇక్కడ ఎవ్వరూ గమనించని ఒక విషయం ఉంది. హీరో చెల్లెలు చావుకి కారణమైన లైన్ మెనే ట్రైన్ లో మందుకొట్టిన వారిలో ఉంటాడు. అందుకే ‘అపరిచితుడు’ మళ్ళీ వచ్చి అతన్ని చంపేస్తాడు. ఈ విషయంలో డైరెక్టర్ శంకర్ కూడా కన్ఫ్యూజ్ చేసాడనే చెప్పాలి.