మెగాఫ్యామిలీలో నీహారిక పెళ్లి సందడి మొదలైంది. మెగాబ్రదర్ నాగబాబు నీహారిక పెళ్లిని ఘనంగా చేయనున్నారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో నీహారిక పెళ్లి జరగనుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం జరిపించనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి పనుల్లో బిజీ అయింది. సెలబ్రిటీల పెళ్లిళ్ల టాపిక్ వచ్చేసరికి.. కట్నకానులకు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
అయితే ఆ విషయాలను గోప్యంగానే ఉంచుతారు. కానీ బయటకి మాత్రం కొన్ని వార్తలు వస్తుంటాయి. నిహారిక పెళ్ళికి సంబంధించి కూడా కట్నకానుకలపై అలాంటి ఊహాగానాలే జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తోన్న గాసిప్స్ ప్రకారం.. నీహారిక పెళ్లికి.. నాగబాబు లాంఛనాలా కింద దాదాపు పది కోట్ల వరకు ఇచ్చుకుంటున్నట్లు సమాచారం. వీటితో పాటు నీహారికకి రెండు కోట్ల విలువైన బంగారంతో పాటు.. హైదరాబాద్ లో నీహారిక పేరు మీద ఉన్న ఇంటిని కూడా అల్లుడికి ఇచ్చేస్తున్నారట.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి నటుల పెళ్లిళ్లు జరిగినప్పుడు కూడా కట్నకానులపై ఇలానే చాలా ఊహాగానాలు వినిపించాయి.