Salman Khan: సల్మాన్ సినిమాలో డాన్స్.. తెలుగులో భారీ బిజినెస్?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషించాడు. ఓ బాలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్ హీరో సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. కానీ సల్మాన్… చిరంజీవి సినిమాలో నటించాడు అంటే మెగా ఫ్యామిలీతో అతనికి ఏ రేంజ్ అనుబంధం ఉందో అర్ధం చేసుకోవచ్చు.సల్మాన్ ఖాన్ నటించడం వల్ల ‘గాడ్ ఫాదర్’ సినిమాని హిందీలో కాస్త ఎక్కువ రేట్లకు అమ్ముకోవడం జరిగింది.

వాటి వాల్యూ రూ.50 కోట్ల వరకు ఉండవచ్చు అన్నది అంచనా. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..ముఖ్యంగా చరణ్ కు సల్మాన్ కు మధ్య ఇంకా మంచి స్నేహ బంధం ఉంది. అందుకే సల్మాన్ కొత్త సినిమాలో రాంచరణ్ డాన్స్ చేసి సగం బాకీ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ‘కిసీ క భాయ్ కిసీ కి జాన్’ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుండగా టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఓ పాట బయటకొచ్చింది.

ఈ పాటలో (Salman Khan) సల్మాన్-వెంకీ తో కలిసి చరణ్ డాన్స్ చేశాడు. అది కూడా లుంగీలో.! ట్యూన్ కూడా బాగుంది. సల్మాన్ సినిమాకి తెలుగులో కూడా ఎక్కువ బిజినెస్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘ ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో కూడా చరణ్ గొంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెలుగు వెర్షన్ లో సల్మాన్ పాత్రకి చరణ్ డబ్బింగ్ చెప్పడం జరిగింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus