పాత సినిమాలను డిజిటల్ చేసి.. రీ రిలీజ్ లు చేయడం అనే ట్రెండ్ గతేడాది పోకిరి సినిమాతో మొదలైంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాని థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకుల కోసం ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఎక్కువ షోలు వేయకపోయినా ఆ సినిమా రికార్డు కలెక్షన్స్ ను సాధించింది. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న సినిమా అయినప్పటికీ పోకిరి రికార్డ్ కొట్టింది. ఇక దాని తర్వాత వరుసగా చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ ..
పోకిరి రేంజ్ లో సందడి చేసినవి కావు అని చెప్పాలి. అయితే మళ్లీ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయ్యింది బిజినెస్ మెన్. ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో సందడి జరుగుతుంది. బిజినెస్ మెన్ కూడా ఎక్కువ షోలు అయితే పడలేదు. అయితే 80 శాతం హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక అసలు విషయానికి వస్తే.. గతేడాది మహేష్ పుట్టిన రోజుకి , ఈసారి మహేష్ పుట్టినరోజు కి కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన సినిమాలే రీ రిలీజ్ అయ్యాయి.
మరి నెక్స్ట్ బర్త్ డే కి ఫ్యాన్స్ కి ఈ రేంజ్ లో స్టఫ్ అందించే సినిమాలు ఏమున్నాయి. మహేష్ ను పూరి ప్రెజెంట్ చేసినంత ఎనర్జిటిక్ గా మరో దర్శకుడు ప్రెజెంట్ చేయలేదు అనేది వాస్తవం. అయితే తర్వాత వీళ్ళు కలిసి సినిమా చేసే అవకాశాలు తక్కువే ఉన్నాయి. ప్రస్తుతానికి వీళ్ళు ఎడమొహం.. పెడ మొహం అన్నట్టు ఉంటున్నారు.