Samantha: బాలీవుడ్ నుంచి సమంతకు 20 కోట్ల ఆఫర్?

నాగచైతన్య నుంచి సమంత విడిపోయిన తర్వాత తన సినీ జీవితాన్ని సరికొత్త దారిలో కొనసాగిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమె విభిన్నమైన తరహాలో సినిమా కథలను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో ఆమె రేంజ్ మరో స్థాయికి పెరిగిపోయింది అని చెప్పాలి. అంతేకాకుండా సమంత రానున్న రోజుల్లో మరిన్ని విభిన్నమైన ప్రాజెక్టులతో ఆశ్చర్యాన్ని కలిగించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అంతే కాకుండా యశోద అనే మరొక సినిమాతో కూడా ఆమె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ గట్టిగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సమంతకు 20 కోట్ల పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సంస్థ మరేదో కాదు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి సమంతకు మూడు ప్రాజెక్టులకు సంబంధించిన ఆఫర్లో వచ్చినట్లుగా టాక్ వస్తోంది.

సమంత ఒకేసారి మూడు సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు అయితే ఆమెకి ఇరవై కోట్ల వరకు పారితోషికం ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రతినిధులు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఈ ఆఫర్స్ పై సమంత చాలా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ లకు సంబంధించిన విషయాలలో చర్చలు జరుగుతున్నాయట. ఆ విషయంలో క్లారిటీ వస్తే సమంత ఆఫర్ కు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రస్తుతం సమంతకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మరో యాక్షన్ థ్రిల్లర్ చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus