Prabhas: ప్రభాస్ సినిమాకు షాకింగ్ ఆఫర్.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. డార్క్ థీమ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కేజీఎఫ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా హక్కులను ఊహించని రేంజ్ లో డిమాండ్ నెలకొంది. ఈ మూవీ అన్ని భాషల హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్లు వస్తుండటం గమనార్హం. తాజాగా సలార్ మూవీ ఓవర్సీస్ బిజినెస్ డీల్ కు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది.

ఫారస్ ఫిల్మ్స్ అనే సంస్థ ఓవర్సీస్ లో సలార్ సినిమాకు బిజినెస్ చేసి అమౌంట్ అందేలా చూడనుందని ఆ సంస్థకు కమిషన్ దక్కనుందని తెలుస్తోంది. సలార్ సినిమాకు ప్రస్తుతం ఓవర్సీస్ లో 75 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. అయితే రిలీజ్ కు ఆరు నెలల సమయం ఉండటంతో సలార్ నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సలార్ సినిమా పలు రిలీజ్ డేట్లను మార్చుకుంది.

మరోవైపు సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో సినిమాను పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది. మరో ఐదేళ్ల పాటు ప్రశాంత్ నీల్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ కు రెమ్యునరేషన్ విషయంలో భారీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్3 సినిమాను కూడా తెరకెక్కించాల్సి ఉన్నా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రశాంత్ నీల్ సలార్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్రిటిక్స్ రివ్యూలతో పని లేకుండా ప్రశాంత్ నీల్ సినిమాలకు కలెక్షన్లు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus