Spy Movie: స్పై మూవీ ఫస్ట్ సాంగ్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్!

  • June 12, 2023 / 11:55 AM IST

కార్తికేయ 2 తో పాన్ ఇండియా వైడ్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతను హీరోగా నటించిన స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్ 29న విడుదల కాబోతోంది. టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. స్పై టీజర్ చాలా మందిని ఎక్సైట్ చేసింది.

ఇక చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న (Spy )ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈ మధ్యనే జూమ్ జూమ్ రే అనే పాటను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సీతారామం వంటి సూపర్ హిట్ చిత్రానికి సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యంలో రూపొందిన స్పై చిత్రంలోని ఈ పాట .. శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటుంది. అప్పుడే ఈ పాట యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టింది.

నిఖిల్ – ఐశ్వర్య మీనన్ ల పెయిర్ కూడా ఈ పాటకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రంలో సన్యా టాకూర్, ఆర్యన్ రాజేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు . శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘ఈడి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌ల‌పాటిలు కలిసి నిర్మిస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus