ఈ హీరోలకు బాలీవుడ్ సినిమాలు భారీ షాకిచ్చాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే తొలి ప్రయత్నంలో ఎక్కువమంది హీరోలకు నెగిటివ్ రిజల్ట్ దక్కింది. అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. తెలుగులో 40 కోట్ల రూపాయల మార్కెట్ ను సొంతం చేసుకున్న నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా ఫలితం నాగ చైతన్యకు భారీ షాకివ్వడం గమనార్హం.

మరో స్టార్ హీరో రానా దమ్ మారో దమ్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. స్టార్ హీరో రామ్ చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ ను పరీక్షించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నితిన్ హీరోగా అగ్యాత్ పేరుతో ఒక సినిమా హిందీలో తెరకెక్కగా ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

రక్తచరిత్ర2 సినిమాతో సూర్య బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. రావణ్ సినిమాతో విక్రమ్ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. దుల్కర్ సల్మాన్ కారవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.

తొలి అడుగు తడబడినా తర్వాత ప్రాజెక్ట్ లతో ఈ సెలబ్రిటీలు ప్రేక్షకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ స్టార్ సెలబ్రిటీలకు ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ సెలబ్రిటీలు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus