Anasuya: అనసూయపై అసభ్యంగా కామెంట్లు.. పోలీసులకు ఎలా చిక్కాడంటే?

బుల్లితెర యాంకర్ అనసూయ జబర్దస్త్ షోకు ముందు పలు సినిమాలలో కనిపించినా జబర్దస్త్ షో ద్వారానే పాపులర్ అయ్యారు. ఈ షో వల్ల అనసూయకు సినిమా ఆఫర్లు రాగా సినిమాలలో ఆమె నటించిన పాత్రలకు మంచి పేరు రావడం ఆమె సినీ కెరీర్ కు ప్లస్ అయింది. రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు ఆ సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ ఇమేజ్ ను మార్చేసింది.

అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనసూయ ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ గురించి ఊహించని స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో తనపై నెగిటివిటీ అంతకంతకూ పెరగడం అనసూయను సైతం ఎంతగానో హర్ట్ చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి అనసూయ కొన్ని వారాల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనసూయ టార్గెట్ గా పోస్టులు చేసిన ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

అనసూయకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు చేసిన వ్యక్తి పేరు పండిరి రామ వెంకట వీర్రాజు. వీర్రాజు ప్రైవేట్ జాబ్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వీర్రాజును తాజాగా కోర్టులో హాజరు పరచిన పోలీసులు ఈ వ్యక్తి హీరోయిన్లు, యాంకర్ల గురించి అసభ్యంగా వార్తలు రాస్తున్నాడని పేర్కొన్నారు. సాయిరవి అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసి పలువురు యాంకర్ల ఫోటోలను ఆ అకౌంట్ లో ఈ వ్యక్తి పోస్ట్ చేయడంతో పాటు అసభ్యంగా కామెంట్లు చేశాడని పోలీసుల నుంచి సమాచారం అందుతోంది.

సోషల్ మీడియా అకౌంట్లలో హీరోయిన్ల పేర్లు పెట్టి అసభ్యమైన రాతలు రాసిన వీర్రాజు అనసూయ ఫిర్యాదు వల్ల అరెస్ట్ అయ్యారు. చెప్పడానికి సాధ్యం కాని విధంగా హీరోయిన్ల, యాంకర్ల గురించి పోస్ట్ లు పెట్టిన వీర్రాజును కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. తనను వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో అనసూయ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కొన్నిరోజుల పాటు కోనసీమలోనే మకాం వేసి పదేపదే ఫోన్లు, ఫోన్ నంబర్లు మారుస్తున్న వీర్రాజును పోలీసులు పట్టుకున్నారు.

నయనతార రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా తెలుగులో ఎక్కువ ప్రాజెక్ట్ లకు ఆమె ఓకే చెప్పడం లేదు. నయనతారకు సోషల్ మీడియాలో కూడా భారీగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags