టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ధమ్కీ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు ఎన్టీఆర్, విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కు థ్యాంక్స్ అని చెప్పారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ అందించగా రైటర్ వల్ల ప్రొడ్యూసర్ లాభం పొందవచ్చని ఈ రైటర్ ప్రూవ్ చేశాడని పేర్కొన్నారు. ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ లో ఒక్క డైలాగ్ కూడా బ్యాలెన్స్ ఆగదని హైపర్ ఆది కామెంట్లు చేశారు.
షూట్ కు ముందే కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ను ప్రసన్న కుమార్ ఇచ్చేస్తాడని ఆది అన్నారు. రైటర్, డైరెక్టర్ గా సక్సెస్ అయిన త్రివిక్రమ్ ను చూశామని ప్రసన్న కుమార్ ను మనం చూడబోతున్నామని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. షూట్ సమయంలో నేను, రంగస్థలం మహేష్ హీరోయిన్ ను చూస్తూ ఉండేవాళ్లమని విశ్వక్ సేన్ ది డిఫరెంట్ యాటిట్యూడ్ అని ఆది అన్నారు. విశ్వక్ సేన్ కోపమొస్తే కొడతాడని పాపమనిపిస్తే సాయం చేస్తాడని నచ్చకపోతే నెడతాడని నచ్చితే హార్ట్ లో పెట్టుకుంటారని ఆది పేర్కొన్నారు.
బాలకృష్ణలా విశ్వక్ సేన్ కూడా భోళా మనిషి అని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. విశ్వక్ సేన్ ఏం చేసినా ట్రెండ్ క్రియేట్ చేస్తుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ అనే పేరు పెట్టుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలని అది నిలబెట్టుకోవాలంటే ఇంకా ధైర్యం కావాలని కానీ దాన్ని నిలబెట్టి తొడగొట్టి దటీజ్ ఎన్టీఆర్ అని ప్రూవ్ చేశారని హైపర్ ఆది వెల్లడించారు. వచ్చిన కొత్తలో తాతకు మనవడు అన్నారని ఆది మూవీ రిలీజయ్యాక తాతకు తగ్గ మనవడు అన్నారని ఆర్.ఆర్.ఆర్ మూవీ వరకు తాతే మనవడి రూపంలో పుట్టాడని అందరూ అనుకుంటున్నారని హైపర్ ఆది పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కు 70 సంవత్సరాల వయస్సు వస్తే ఆయనే మనందరికీ సీనియర్ ఎన్టీఆర్ అని హైపర్ ఆది కామెంట్లు చేశారు. డైరెక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పకుండా చూస్తుండిపోయే నటన ఎన్టీఆర్ కు మాత్రమే సొంతమని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. కళ్లతో కూడా ఎక్స్ ప్రెషన్ పలికించే హీరో ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమా కూడా దండయాత్ర అని ఆది పేర్కొన్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ దేశం మీసం తిప్పిన మూవీ అని ఆది వెల్లడించారు. ఆస్కార్ విషయంలో మనం గర్వపడాలని ఆది పేర్కొన్నారు.