సినిమా పరిశ్రమలో ఎవరిమీదైనా ట్రోలింగ్ జరిగినా, లేని పోని మాటలు అంటుంటే రియాక్ట్ అయ్యే అతి కొద్దిమందిలో టీవీ, సినిమా కమెడియన్ హైప్ ఆది ఒకరు. పరిస్థితులను చక్కాగా విశ్లేషిస్తూ, ఏం జరిగింది, దానికి ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ సరైనదేనా అంటూ ఆయన మాట్లాడుతుంటారు. అలా తాజాగా ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో ఆది మాట్లాడారు. అందులో ఇండస్ట్రీలోని వ్యక్తులపై గురించి గత కొన్ని ఏళ్లుగా వస్తున్న కామెంట్లతోపాటు.. లేటెస్ట్ టాపిక్ రాజమౌళి కామెంట్లు – రియాక్షన్‌పై మాట్లాడారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘వారణాసి’ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఆంజనేయుడి గురించి రాజమౌళి తప్పుగా మాట్లాడారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేసులు కూడా పెడుతున్నారు. కొంతమంది హిందూ మత పెద్దలు, పార్టీల నాయకులు కూడా జక్కన్నను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళిని హైపర్ ఆది తనదైన శైలిలో వెనకేసుకొచ్చాడు.

హనుమంతుడిపై రాజమౌళి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చెయ్యలేదు, అవమానించలేదు. ఆ రోజు ఈవెంట్‌లో గ్లింప్స్ వీడియో రిలీజ్ అవ్వడం ఆలస్యమవ్వడంతో సీరియస్ అయ్యారంతే. రామాయణం, మహాభారతం అంటే ఇష్టం అని చెప్పే ఆయన అలాంటి మాటలు అంటాడా? ఏదో పొరపాటున దొర్లిన మాట అది. దీనికి ట్రోల్స్ చేయడం మంచిది కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ఆయన అనే విషయం గుర్తు పెట్టుకోండి అని హైపర్ ఆది సూచించారు.

హీరోలపై చిన్న విషయాలకే ట్రోల్స్ చెయ్యడం ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది. సినిమాలు భారీ కథతో వచ్చినా ప్లాప్ అవుతున్నాయి. ఇలాంటి పనులు మానుకుంటే తెలుగు సినిమాలు హిట్ అవుతాయని హైపర్ ఆది అన్నారు. మరోవైపు రాజమౌళిపై కేసులు పెడుతూనే ఉన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దేవుడి మీద సినిమాలు చేస్తూ, సినిమాల్లో దేవుడిని చూపిస్తూ కలెక్షన్లు అందుకుంటున్న రాజమౌళి.. ఇలా దేవుడిని అనడం సరికాదు అంటున్నారు.
https://x.com/FilmyFocus/status/1990811413619859588?s=20
https://x.com/FilmyFocus/status/1990811949114998866?s=20
