ఇష్టం లేకుండానే విజయ్ దేవరకొండతో అలాంటి సీన్లలో నటించా : రాశీ ఖన్నా

‘తొలి ప్రేమ’ చిత్రం నుండీ రాశీ ఖన్నా కి క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. అప్పటి వరకూ కాస్త బొద్దుగా ఉంటూ.. గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన రాశీ ఖన్నా లో ఇంత గొప్ప నటి ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఆ చిత్రం. తరువాత ఆమె చేసిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం ప్లాప్ అయినా.. అందులో ఈమె నటనకు అలాగే లుక్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘వెంకీ మామ’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి.

దాంతో ఈమెకు గుడ్ టైం స్టార్ట్ అయ్యింది అని అంతా అనుకున్నారు. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈమెకు పెద్ద షాక్ ఇచ్చింది. హ్యాట్రిక్ మిస్ అవ్వడం మాత్రమే కాదు… రాశీ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. అయితే బోల్డ్ రోల్స్ చేస్తే ఇంకా ఎక్కువ ప్టూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పుకొచ్చిన రాశీ. ఇప్పుడు మాట మార్చేస్తుంది. విషయం ఏమిటంటే.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో రాశీ ఖన్నా కు విజయ్ కు హాట్ బెడ్ సీన్స్ ఉంటాయి.

విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి లిప్ లాక్ లకు కూడా లోటు ఉండవు. టీజర్ రిలీజ్ అయినప్పుడు రాశీ ఫ్యాన్స్ ఆ సీన్ ల గురించి గోల పెట్టేశారు. కానీ రాశీ కవర్ చేసింది. ఇప్పుడు మాత్రం…’ ఆ సీన్ లు ఇష్టం లేకుండానే చేశాను. విజయ్ ముందుగానే చెప్పాడు.. ‘నాకు ఆల్రెడీ ఆ ఇమేజ్ ఉంది… నీకు అలాంటి ఇమేజ్ లేదు కదా ఆలోచించుకో అని’ కానీ నేను అప్పుడు అర్ధం చేసుకోలేకపోయాను. సినిమా రిలీజ్ అయ్యాక చాలా బాద పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus