Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అఖిల్ సినిమా 30 సార్లు చూశాను : అక్కినేని అఖిల్

అఖిల్ సినిమా 30 సార్లు చూశాను : అక్కినేని అఖిల్

  • December 27, 2017 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ సినిమా 30 సార్లు చూశాను : అక్కినేని అఖిల్

తాతయ్య మహానటుడు, తండ్రి అగ్ర కథానాయకుడు, అమ్మ ఒకప్పటి అగ్ర కథానాయకి, ఇక అన్నయ్య యువ కథానాయకుల రేస్ లో ఎప్పట్నుంచో ఉన్నాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ తొలి చిత్రంతో చతికిలపడ్డాడు అఖిల్ అక్కినేని. తాను స్టార్ హీరోగా ఎదగడం కంటే ముందుగా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడం ముఖ్యం అనుకొన్నాడు. అందుకే మొదటి సినిమా విషయంలో జరిగిన తప్పులు సెకండ్ సినిమాలో రిపీటవ్వకూడదనే ధృడ నిశ్చయంతో కొన్నాళ్లపాటు గ్యాప్ తీసుకొని మరీ నటించిన చిత్రం “హలో”. “మనం, 24” చిత్రాల ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ మంచి విజయం సొంతం చేసుకొంది. ఈ సందర్భంగా మీడియాతో తన ఆనందాన్ని, తదుపరి చిత్రాల వివరాల్ని, తన మొదటి సినిమా ఫ్లాపైనప్పుడు తాను పడిన మనోవేదనను, తనకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రుల గురించి ముచ్చటించాడు అఖిల్ అక్కినేని. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..!!

అదే బెస్ట్ కాంప్లిమెంట్..
“హలో” సినిమా రిలీజ్ కి ముందు, తర్వాత చాలా కామెంట్స్, కాంప్లిమెంట్స్ వచ్చాయి కానీ.. ఒకమ్మాయి “యు స్టోల్ మై హార్ట్ ఇన్ ది క్లైమాక్స్ ఎపిసోడ్” అని మెసేజ్ పెట్టింది. నావరకూ అదే బెస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అని అడగకండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు (నవ్వుతూ..).Akhil

మామూలు టెన్షన్ లేదు..
అసలే మొదటి సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది, రెండో సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన ఒకవైపు, రిజల్ట్ ఏమవుతుందో అనే ఆలోచన మరోవైపు. రిలీజ్ రోజైతే ఓవర్సీస్ షోస్ టాక్ వచ్చేవరకూ నిద్ర కూడా పోలేదు. ఇక్కడ కూడా కొన్ని వెబ్ సైట్స్ లో పాజిటివ్ రివ్యూస్, ట్విట్టర్ లో కొందరు సినిమా గురించి పెట్టిన పోస్ట్స్ చూసి “హమ్మయ్య” అనుకోని రిలాక్స్ అయ్యాను.Akhil

అది మూడు నెలల కష్టం..
“హలో” సినిమాలో నేను పాట పాడడం నాన్నగారికి మొదలుకొని అందరికీ షాకే. బేసిగ్గా నేనూ, అనూప్ మంచి ఫ్రెండ్స్.. ఒకసారి ఏదైనా కొత్తగా చేద్దాం అనుకొంటున్న టైమ్ లో “నువ్ పాట పాడు” అన్నాడు. జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ.. ఒక మూడు నెలలపాటు నాకు చిన్నపాటి ట్రయినింగ్ కూడా ఇచ్చి మరీ నాచేత పాట పాడించాడు. లక్కీగా జనాలు ఆ పాటను యాక్సెప్ట్ చేశారు. అయితే.. ఇంకోసారి పాడాలన్న ఆశ మాత్రం లేదు.Akhil

అందుకోసం 60 రోజుల కష్టపడ్డాను..
ఈ సినిమాలో నా నటన తర్వాత అందరూ మెచ్చుకుంటున్న అంశం యాక్షన్ సీక్వెన్స్ లు. అసలు సినిమా అనుకొన్నప్పుడే యాక్షన్ పార్ట్ కోసం సీజీ వాడకూడదు అని. అందుకే బాబ్ బ్రౌన్ నేతృత్వంలో 60 రోజులపాటు ట్రయినింగ్ తీసుకుని ఆ యాక్షన్ సీన్స్ చేశాను. అందుకే అవి అంత సహజంగా ఉంటాయ్.Akhil

లేడీస్ “ఐ హేట్ యూ” అని మెసేజులు పంపుతున్నారు..
“హలో” సినిమాతో విక్రమ్ కుమార్ గారు “ఐ హేట్ యూ”కు సరికొత్త మీనింగ్ ఇచ్చేశారు. దాంతో సినిమా చూసినవాళ్లలో సగానికిపైగా లేడీస్ అందరూ నాకు “ఐ హేట్ యు” అని మెసేజ్ చేస్తున్నారు. ఆ మెసేజులు చవుతుంటే చాలా ఆనందంగా ఉంది.Akhil

నా ఆశయం ఒక మంచి సినిమా తీయడం..
ఈమధ్య ఫిలిమ్ మేకింగ్ అంటే కలెక్షన్స్, గ్రాస్, షేర్ లెక్కలు అయిపోయాయ్. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందిద్దామనే ఆతృత నవతరం ఫిలిమ్ మేకర్స్ లో ఉండడం లేదు. నేను మాత్రం నా తదుపరి చిత్రాల ఎంపికలో ఒక మంచి సినిమా తీయాలనే కోరికతో మాత్రమే సబ్జెక్టులు వింటున్నాను. అదే సమయంలో నన్ను నేను నటుడిగా ప్రూవ్ చేసుకోవాలన్న తపన కూడా ఉంది.Akhil

ఎప్పుడు వేలు పెట్టలేదు..
నేనేదో విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ వర్క్ లో కాలు-వేలు పెట్టానని కామెంట్స్ విన్నాను. నేనసలు అలా వేలు పెట్టే టైప్ కాదు. అందునా విక్రమ్ కుమార్ చాలా క్లారిటీ మెయింటైన్ చేసే వ్యక్తి. ఆయన పనిలో వేలు పెట్టే అవకాశం ఎవ్వరికీ ఇవ్వడు.Akhil

కలిస్తే కాంబినేషన్ క్రియేట్ చేసేస్తారా..
నేను కొరటాల శివగారిని ఒకేఒక్కసారి లంచ్ కి కలిశాను. అంతే మేమిద్దరం కలిసి సినిమా చేస్తున్నామని టాక్ స్ప్రెడ్ అయిపోయింది. అలా చెప్పాలంటే “అఖిల్” రిలీజయ్యాక నేను ఆల్మోస్ట్ ఒక వందమంది డైరెక్టర్స్ ని కలిశాను. వాళ్లందరితోనూ సినిమాలు చేయాలంటే నాకు ఈజన్మ సరిపోదు.Akhil

ఆ సమయంలో నాన్న ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేను..
పరిచయం చిత్రం ఫ్లాప్ అయ్యింది. పర్సనల్ గానూ కొన్ని రీజన్స్ కారణంగా చాలా క్రుంగిపోయాను. అసలు రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ కూడా ఓపెన్ చేసేవాడ్ని కాదు. కొన్నిరోజులు అసలు ఎలా ఉన్నానో నాకే తెలియదు. ఆ టైమ్ లో నాన్న ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేను. నేను అలానే ఉంటే ఇంకా కృంగిపోతాను అని ఆలోచించి విక్రమ్ కుమార్ సినిమా కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ కథ చెప్పడం, నాన్నగారితోపాటు అందరికీ నచ్చడం.తో వెంటనే సెట్స్ కి వెళ్లిపోయామ్. ఇక అప్పట్నుంచి సినిమాకి అంకితమై నా పర్సనల్ ప్రోబ్లమ్స్ ని మర్చిపోయాను.Akhil

అన్నయ్య అలా అనేసరికి…
మా అన్నయ్య నా బెస్ట్ క్రిటిక్. సినిమా చూశాక బాగుందని కానీ, హిట్ అవుతుందని కానీ ఏమీ చెప్పలేదు. ఒకే ఒక్క మాట అన్నాడు “నువ్ యాక్టర్ గా బాగా ఓపెన్ అప్ అయ్యావురా, ఇలాగే కంటిన్యూ చెయ్. ఆల్ ది బెస్ట్” అని చెప్పి హగ్ చేసుకున్నాడు.Akhil

అఖిల్ సినిమా ఇప్పటివరకూ 30 సార్లు చూశాను..
ఒకరు చెప్పేదానికంటే.. మనం చేసిన పనుల నుంచే మనం ఎక్కువ నేర్చుకుంటాం. అందుకే నా ఫస్ట్ ఫెయిల్యూర్ “అఖిల్”ను దాదాపు 30సార్లు చూశాను. చూసిన ప్రతిసారీ సినిమాలో తప్పేముంది, నేను తప్పుగా ఎక్కడ నటించాను అని చెక్ చేసుకొనేవాడ్ని. నేను, వినాయక్ గారూ ఎంతో నమ్మి చేసిన సినిమా అది.Akhil

అదే నా న్యూఇయర్ రిజల్యూషన్..
ఇకపై నేను హాలీడేస్ అని, ఎంజాయ్ మెంట్ అని ఇక టైమ్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అందుకే జనవరి 10కి నా తదుపరి సినిమా ఎనౌన్స్ మెంట్ ఇవ్వడమే కాక ఫిబ్రవరి కల్లా సినిమా మొదలెట్టేస్తాను కూడా. 2018 ద్వితీయార్ధంలో సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం.

– Dheeraj Babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Hello interview
  • #Akhil Interview
  • #Akhil Movies
  • #Hello Movie

Also Read

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

related news

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

trending news

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

8 hours ago
Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

16 hours ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

16 hours ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

1 day ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago

latest news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

1 day ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

1 day ago
Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

1 day ago
Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

1 day ago
Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version