ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి పదహారేళ్లు అయినప్పటికీ.. ఇప్పటివరకు తనకు సొంతిల్లు లేదని నటుడు విశాల్ అన్నారు. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీల్ సంస్మరణ సభలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు తారలు పాల్గొన్నారు. పునీత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో విశాల్ కూడా మాట్లాడారు. పునీత్ మరణవార్త తెలియగానే కన్నీళ్లు ఆగలేదని.. ఆ వార్తను జీర్ణించుకోవడానికి రెండురోజుల సమయం పట్టిందని అన్నారు.
పునీత్ తో తనకు అంత అనుబంధం లేకపోయినా.. ఆయనకు అభిమానినని చెప్పుకొచ్చారు. పునీత్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవారని.. మరణించేవరకు ఎవరికీ తెలియదని.. అలాంటి గొప్ప వ్యక్తి చేసిన సేవా కార్యక్రమాల్లో తను కూడా భాగం కావాలనుకుంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై తను చదివిస్తానని.. వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పారు. తనకు ఇప్పటివరకు సొంతిల్లు లేదని.. తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నానని..
సొంతిల్లు నిర్మించుకోవాలని ఇప్పటివరకు డబ్బు కూడబెట్టుకున్నానని చెప్పారు. ఆ డబ్బునే ఇప్పుడు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని విశాల్ చెప్పుకొచ్చారు.