సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ గారి మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆగస్ట్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.టీజర్ ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ చిత్రం నిర్మాతలకు ప్రాఫిట్స్ దక్కడం విశేషం. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ వివరాల విషయానికి వస్తే.. కంప్లీట్ ఈ మూవీని నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ మూవీ క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే కొంత వరకు రాబట్టాలి.
ఆ వివరాలను ఓసారి పారిశీలిద్దాం :
నైజాం
0.70 cr
సీడెడ్
0.50 cr
ఆంధ్రా(టోటల్)
0.60 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
1.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.35 cr
వరల్డ్ వైడ్ టోటల్
2.15 cr
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రానికి రూ.6.2 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రూ.8.2 కోట్ల వరకు వచ్చాయి. అంటే నిర్మాతకి ఆల్రెడీ రూ.2 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చిందన్న మాట. థియేట్రికల్ రైట్స్ పరంగా అయితే క్లీన్ హిట్ స్టేటస్ కు రూ.2.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.