Allu Arjun: వైజాగ్ చేరుకున్న అల్లు అర్జున్… సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఈయన వైజాగ్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గత రాత్రి 10 గంటలకు వైజాగ్ కు బయలుదేరిన అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేశారు.అయితే అల్లు అర్జున్ వస్తున్నారని తెలియగానే పోలీసులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకొని ఆయనకు బందోబస్తు నిర్వహించారు.

ఇలా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించినప్పటికీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టు వద్దకు చేరుకొని సందడి చేశారు.అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాగానే అభిమానులు తనపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక అల్లు అర్జున్ సైతం అభిమానులకు అభివాదం చేస్తూ పయనించారు. ఇలా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తాజా షెడ్యూల్ వైజాగ్ లో జరగనుంది. ఈ షెడ్యూల్లో భాగంగా అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనుల కోసం ఈయన వైజాగ్ చేరుకున్నారు.అయితే తమ అభిమాన హీరోని ఇలా చూడటంతో పెద్ద ఎత్తున అభిమానులు తనని చుట్టుముట్టి తనతో సెల్ఫీల కోసం ఏగబడ్డారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో భాగంగా హీరోతోపాటు ఇతర తారాగణంపై సుకుమార్ చిత్రీకరణ జరపగా వచ్చే నెలలో నటి రష్మిక మందన్న ఈ సినిమా షూటింగులో భాగం కానుంది.

ఎన్నో అంచనాల నడుమ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. 2021 వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో మనకు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus