ఇళయరాజా కథ రాస్తోన్న దర్శకుడు!
- July 12, 2016 / 02:11 PM ISTByFilmy Focus
ఇళయరాజానీ, భారతీయ సినీ సంగీతాన్నీ వేరు చేసిచూడలేం. తరాలు మారుతున్నా… ఇప్పటికీ రాజానే ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పాటలు శ్రోతల మనసుల్లో ఎప్పుడూ భద్రంగానే ఉంటాయి. ఇళయరాజా జీవితం, ఆయన ఎదిగిన విధానం, పాటల కోసం పడిన తాపత్రయం, ఆయన వ్యక్తిత్వం ఇవన్నీ ప్రత్యేకమే. ఆయన జీవిత కథ తెలుసుకోవాలనిఎవరికి ఉండదు చెప్పండి? అలాంటి ఇళయరాజా ఫ్యాన్స్‌కి ఓ శుభవార్త.
ఇళయరాజా జీవితం త్వరలోనే ఓ పుస్తకంగా రాబోతోంది. రాస్తోంది ఎవరో కాదు… సుప్రసిద్ధ దర్శకుడు వంశీ. ఇళయరాజాతో వంశీకి గొప్ప అనుబంధం ఉంది. వంశీ సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నింటికీ రాజానే సంగీత దర్శకుడు. ఆ చనువుతోనే ఇళయరాజా జీవిత కథ రాయబోతున్నాడట. మరి ఆ పుస్తకం ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు బయటకు వస్తుందో..?? అందులో ఎన్ని గొప్ప సంగతులు ఉంటాయో..?? వేచి చూడాల్సిందే..!












