పవన్ కళ్యాణ్ ఇటీవల నర్సాపురంలో ఏర్పాటు చేసిన ఓ మీటింగ్లో మళ్ళీ ఏపి ప్రభుత్వం అనగా వైఎస్సార్ సిపి ప్రభుత్వం పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ధూమారాన్ని రేపడమే కాకుండా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న పవన్ ‘భీమ్లా నాయక్’ సినిమా పై పెద్ద ఎఫెక్ట్ పడేలా చేసింది. ‘భీమ్లా నాయక్’ వంటి పెద్ద సినిమా ఫిబ్రవరి 25న విడుదల కాబోతుండగా.. విడుదల రోజునాడు ఏపిలో 5వ షోకి అనగా బెనిఫిట్ షోలకు ఏపి ప్రభుత్వం నిరాకరించింది.
అనుమతులు లేకుండా బెన్ ఫిట్ షోలు కనుక ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంది. టికెట్లు కూడా ప్రభుత్వ నిభందనలు మేరకే అమ్మాలని ఆదేశిస్తుంది.ప్రతి ధియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుందని ,ధియేటర్ యాజమాన్యం సహకరించాలని చెప్పుకొచ్చింది. జీవో నెంబర్ 35ని కఠినంగా అమలు చేయాలని ఏపి ప్రభుత్వం నిశ్చయించుకుంది. ‘అసలు పవన్ కళ్యాణ్ ను మేము ఏమాత్రం టార్గెట్ చేయలేదని… ఆయన సినిమాలకి అంత దమ్ము లేదని’ ఏపి సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ పేర్ని నాని ఇటీవల కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
మరి అలాంటప్పుడు ‘భీమ్లా నాయక్’ కు మాత్రమే ఇలాంటి కఠిన ఆంక్షలు అమలు చేయడం ఏంటి అనేది అర్ధం కాని ప్రశ్న. అయితే ఈ విషయాల పై ఈరోజు ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో.. ఏపి ప్రభుత్వం ఇంకా ఎన్ని కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుందో చూడాలి..!
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!