మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఆ క్రెడిట్ రామ్ చరణ్‌దే..!

మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్స్, డ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి అని కొత్తగా చెప్పక్కర్లేదు.. అప్పటికీ ఇప్పటికీ స్టైలిష్ స్టెప్పులతో రచ్చ చేస్తున్నారాయన.. 65 సంవత్సరాల వయసులోనూ.. అదే ఈజ్, గ్రేస్ అండ్ ఎనర్జీతో మెగా మూమెంట్స్ వేస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.. ఆయన నట వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన స్టైల్ డ్యాన్స్‌తో తండ్రికితగ్గ తనయుడు అనిపించుకున్నాడు.. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చిరు తర్వాత అలాంటి రేర్ ఫీట్ సాధించబోతున్న మెగా కథానాయకుడిగా అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నాడు చరణ్..

వివరాల్లోకి వెళ్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ కియారా అద్వానీ జంటగా.. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ RC 15.. శంకర్ సినిమా అంటే సాంగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఒక్క పాటలో ప్రపంచంలోని ఏడు వింతల్ని చూపించడం అనేది ఆయనకే చెల్లింది.. కోట్లాది రూపాయలతో సెట్స్ వేయించి.. విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారు.. ఈ మూవీ కోసం కూడా అదిరిపోయే రేంజ్‌లో పాటల్ని ప్లాన్ చేస్తున్నారు.

కేవలం పాటల కోసమే అక్షరాలా రూ. 40 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఒక్కో పాటకి ఒక్కో టాప్ కొరియోగ్రాఫర్.. చరణ్ చేత సాలిడ్ స్టెప్పులేయించనున్నారు.. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, పాపులర్ బాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ గణేష్ ఆచార్య, బాస్కో మార్టిస్, టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న జానీ మాస్టర్, ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వంటి టాప్ కొరియోగ్రాఫర్స్ ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు.

అయితే ఒక పాటలో దాదాపు నిమిషంన్నర పాటు నాన్ స్టాప్‌గా మూమెంట్ చేసే బిట్ ఒకటి ఉంటుందట.. దగ్గర దగ్గర 80 సెకన్ల పాటు గ్యాప్ లేకుండా ఫ్లోర్ షేక్ అయ్యే రేంజ్‌లో స్టెప్పులెయ్యబోతున్నాడట చరణ్.. గతంలో చిరు పలుమార్లు ఇలాంటి రేర్ అండ్ రిస్కీ స్టెప్పులతో అలరించారు. ఇప్పుడు చరణ్ కూడా అలా ఆపకుండా డ్యాన్స్ చేయబోతున్నాడని.. ఆ సమయంలో థియేటర్లలో సీట్లలో ఎవరూ కూర్చోరని.. ఈలలు, గోలలతో థియేటర్స్ దద్దరిల్లిపోతాయని అంటున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus