Inaya, Shriha: నామినేషన్స్ లో ఇనయతో ఆడుకున్న శ్రీహాన్..! వీరిద్దరి మద్యలో జరిగిందేంటంటే.,

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ ఫన్నీగా ముగిశాయనే చెప్పాలి. ముఖ్యంగా సూర్యని నామినేట్ చేసి ఇంటి నుంచీ బయటకి పంపించేయడంలో ప్రధాన పాత్ర పోషించిందని ఇనయని నామినేట్ చేశారు కొందరు. మహానటిగా, ఊసరవెల్లిగా రంగులు మారుస్తున్నావంటూ శ్రీహాన్ సైతం ఇనయని మరోసారి నామినేట్ చేశాడు. తనకి కెప్టెన్సీ అప్పుడు కత్తిపోటు గుచ్చిన కారణం, అలాగే వంట చేయడం విషయంలో కో ఆపరేట్ చేయకపోవడం, ఫుడ్ విషయంలో వేస్ట్ చేయడం ఇవన్ని పాయింట్స్ ని బయటపెట్టాడు. దీంతో వీళ్లిద్దరి మద్యలో హోరెత్తిపోయే ఆర్గ్యూమెంట్ అయ్యింది.

ప్రతి మాటకి ఆన్సర్ చెప్తూ ఇనయ రెచ్చిపోయింది. స్టబిలిటీ లేదని చెప్పావ్ కానీ, నీకే స్టబిలిడీ లేదని క్లారిటీ ఇచ్చాడు శ్రీహాన్. అలాగే, కిచెన్ లో డ్యూటీ వేసేటపుడు నేను వంట చేయనని చెప్పావ్, కానీ శ్రీసత్యకి దోశెలు వేశాన్, అలాగే బ్రెడ్ హల్వా చేశావ్ ఇవన్నీ కూడా వంటే అని నిలదీశాడు. అంతేకాదు, అన్నం వేస్ట్ చేస్తే నా కెప్టెన్సీలో ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పాడు.ఇనయ శ్రీహాన్ కి సాలిడ్ ఆన్సర్స్ ఇస్తునే ఉంది. ఇంట్లో నిజంగానే నీకు స్టబిలిటీ లేదని క్లియర్ గా చెప్పింది.

అలాగే, నేను వంట చేయనని క్లియర్ గా చెప్పానని, నేను ఆఖరిసారి వంట చేసింది మా నాన్న కోసమే అని, అది తిన్నాక ఆయనకి గుండెపోటు రావడంతో అప్పట్నుంచీ నేను కిచెన్ జోలికి పోవట్లేదని చెప్పింది. అంతేకాదు, నాకు కర్రీ సరిపోక ఉత్తి అన్నం తినలేక అక్కడ పెట్టాను అని, అన్నం పారేయలేదని క్లారిటీ ఇచ్చింది. అన్నంపై ఏదైనా వాలతాయి అని నీకు తెలిసినపుడు యాజ్ ఏ కెప్టెన్ గా నువ్వు దానిపైన మూత పెట్టి ఉండాల్సింది అంటూ నిలదీసింది. ఇలా వీరిద్దరి మద్యలో మళ్లీ మరోసారి టామ్ అండ్ జెర్రీ ఫైట్ మొదలైంది.

ఈ పాయింట్స్ లో ఇద్దరి ఆర్గ్యూమెంట్స్ కూడా నిజమే కదా అనిపించేలా ఉన్నాయి. అంతేకాదు, ఇద్దరూ ఎప్పుడూ ఒకరికొకరు నామినేట్ చేసుకున్నా కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇదే విషయం హైపర్ ఆది చెప్పగానే నువ్వు మళ్లీ స్టార్ట్ చేశావని శ్రీహాన్ అన్నాడు. ఏదైతే ప్రేక్షకులకి బాగుంటుందో అదే పాయింట్స్ ని పట్టుకుని నామినేట్ చేస్తున్నావని ఇనయ గేమ్ ని ఎద్దేవా చేశాడు. అంతకుముందు ఇదే విషయాన్ని ఆదిరెడ్డి కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. అంతకుముందు శ్రీహాన్ కెప్టెన్ అయ్యాక ఇనయకి కిచెన్ డ్యూటీ వేద్దామని డిస్కస్ చేయబోతుంటేె తన విషయం క్లియర్ గా చెప్పింది ఇనయ.

అంతేకాదు, అన్నం విషయంలో కూడా నేను పారేయలేదని చెప్పింది. ఇప్పుడు నామినేషన్స్ లో ఈరెండు చాప్టర్స్ ని తీస్కుని వచ్చాడు శ్రీహాన్. ఇక్కడే ఇనయని నువ్వు ఏదైనా చేయగలవ్ కానీ, ఈవారం నన్ను నామినేట్ చేయలేవ్ అంటూ లాస్ట్ పంచ్ ఇచ్చాడు. మొత్తానికి ఈవారం ఇనయని ఐదుగురు హౌస్ మేట్స్ నామినేట్ చేశారు. అందరూ కూడా సూర్య నీవల్లే వెళ్లిపోయాడని చెప్పడం గమనార్హం. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరం.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus