Inaya Sulthana, Adi Reddy: ఆదిరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన సుల్తానా..! ఆది చేసిన తప్పేంటి ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయి. గేమ్ ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో ఉన్న సుల్తానా ఆ కోపాన్ని ఆదిరెడ్డిపై తీర్చుకుంది. అసలు టాస్క్ లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ ట్రాష్ లో ఉన్నవారికి మాస్ లోకి వచ్చేందుకు అలాగే, మాస్ లో ఉన్నవారు క్లాస్ లోకి వెళ్లేందుకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. రోల్ బేబీ రోల్ అనే టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న పెద్ద డైస్ లో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉంటారు. సంచాలక్ గార్డెన్ ఏరియాలో ఉన్న చిన్న డైస్ ని పైకి ఎగరేసి వేస్తారు.

అక్కడ ఏ నెంబర్ అయితే పడుతుందో పెద్ద డైస్ లో ఉన్న పార్టిసిపెంట్ దాన్ని దొర్లిస్తూ గార్డెన్ ఏరియాలో ఉన్న స్వేర్ లోకి రావాలి. ఈ టాస్క్ లో పోటీ పడేందుకు సుల్తానా ఇంకా నేహా చౌదరి ఇద్దరూ వచ్చారు. ఇక్కడే సంచాలకులుగా క్లాస్ టీమ్ వాళ్లు వ్యవహరించారు. ఆదిరెడ్డి, గీతురాయల్, ఇంకా ఆర్జే సూర్య ముగ్గురు ఉన్నారు. గీతు డైస్ ని తిప్పి వేసింది. ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయిన సుల్తానా బాలాదిత్య అడ్డువచ్చాడని గొడవ చేసింది. దీంతో కాసేపు అక్కడ హీటెడ్ ఆర్గ్యూమెంట్ అయ్యింది.

ఇక్కడే ఆదిరెడ్డి కొద్దిగా మెల్లగా మాట్లాడండి అంటూ సుల్తానాకి చెప్పాడు. దీంతో సుల్తానా ఆదిరెడ్డితో ఆర్గ్యూ చేసింది. ఆ తర్వాత రౌండ్ లో సుల్తానా ఓడిపోయింది. దీంతో బాగా కోపం వచ్చిన సుల్తానా అసలు హౌస్ లో నాకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదని నోరుజారింది. అంతేకాదు, లివింగ్ రూమ్ లో హౌస్ మేట్స్ అందరికీ ఎక్స్ ప్లనేషన్ ఇచ్చేటపుడు ఆదిరెడ్డితో గొడవ పడింది. మీదకి వచ్చి మాట్లాడుతున్నావ్ అని, ఒక స్టెప్ ముందుకేసి కళ్లు పెద్దవి చేసి చెప్తున్నావేంటి అంటూ ఆర్గ్యూ చేసింది.

దీంతో ఆదిరెడ్డి తనకి ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు. కొద్దిసేపటికి కూల్ అయిన సుల్తానా ఎవరి సపోర్ట్ లేదు అనడం తప్పు అని తన మాటలన్ని వెనక్కి తీసుకుంటున్నాని చెప్పింది. ఇప్పటికే రెండు గేమ్స్ ఆడినా కూడా ఇనయా సుల్తానా ట్రాష్ టీమ్ లోనే ఉంది. ట్రాష్ టీమ్ లో ఉన్నవాళ్లు నేరుగా నామినేషన్స్ లోకి వస్తారని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు. మరి ఈవారం ఇనయ సుల్తానా సేఫ్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus